Fri Dec 05 2025 12:40:09 GMT+0000 (Coordinated Universal Time)
Junior Ntr : తాతకు ధీటుగా జూనియర్ కనిపించే సినిమా త్వరలోనట
జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్ బయటకు రావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి

జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్ బయటకు రావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. ఆయన తాత సీనియర్ ఎన్టీఆర్ పోలికలతో ఉండటంతో నందమూరి ఫ్యాన్స్ లో 90 శాతం మంది ఆయనకు కనెక్ట్ అయ్యారు. అభిమానులుగా మారిపోయారు.నందమూరి కుటుంబంలో బాలయ్య బాబు ఉన్నప్పటికీ ఇద్దరి ఫ్యాన్స్ ఒకరే అయితే. జూనియర్ ఎన్టీఆర్ కు మాత్రం అదనంగా మరికొందరు కూడా ఫ్యాన్స్ అయిపోయారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అంటే ఇక అందరికీ పండగే. వరస చిత్రాలతో బిజీగా గడుపుతున్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు తన తాత తరహాలో మరో వేషం సిద్ధంగా ఉంది.
పౌరాణిక నేపథ్యం ఉన్న...
సీనియర్ ఎన్టీఆర్ పౌరాణిక నేపథ్యం ఉన్న పాత్రల్లో ఇమిడిపోయేవారు. కృష్ణుడిగా, అర్జునుడి పాత్రలే కాకుండా పౌరాణిక గాధల్లో విలన్లుగా చరిత్రకెక్కిన దుర్యోధనుడు వంటి పాత్రలోనూ ఆయన అందరినీ ఆకట్టుకున్నారు. దానవీర శూర కర్ణలో ఆయన నటించిన ఐదు పాత్రలు వేటికదే స్పెషల్. అందుకే జూనియర్ ఎన్టీఆర్ ను కూడా తాత నటించిన పాత్రలో చూడాలని చాలా మంది అనుకుంటారు. అయితే పూర్తి స్థాయి నిడివిగల చిత్రం ఇంత వరకూ రాలేదు. అయితే తాజాగా వస్తున్న అప్ డేట్ ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ త్వరలో పురాణ గాధతో కూడిన సినిమాలో నటించడానికి ఓకే చెప్పినట్లు వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.
తివిక్రమ్ డైరెక్షన్ లో...
అయితే ఇందుకు తివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా ఉంటారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తారు. నాగవంశీ ట్వీట్ తోనే ఈ విషయం బయటకు వచ్చింది. మాటల మాంత్రికుడు, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ తివిక్రమ్ శ్రీనివాస్ ఒక పురాణ కథను సిద్ధం చేసుకున్నాడట. కార్తికేయుడి కథను తెరకెక్చిండానికి సిద్ధమయ్యారు. తొలుత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను ఈ పాత్ర కోసం అనుకున్నా బన్నీ డేట్స్ కుదరకపోవడంతో అది ఎన్టీఆర్ కు షిఫ్ట్ అయినట్లు తెలిసింది. తివిక్రమ్ ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమా పూర్తయిన వెంటనే, అలాగే ఎన్టీఆర్ మూవీల షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కార్తికేయుడిగా కనిపించనున్నారని తెలిసంది. నాగవంశీ ట్వీట్ ద్వారానే ఈ విషయం వెల్లడయింది. తనకుఅత్యంత ఇష్టమైన అన్న శక్తివంతమైన దేవుళ్లలో ఒకరికగా కనిపిస్తున్నాడంటూ ఆయన చేసిన ట్వీట్ తో జూనియర్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
Next Story

