Tue Feb 03 2026 21:02:47 GMT+0000 (Coordinated Universal Time)
జీవిత, రాజశేఖర్ లపై చీటింగ్ ఆరోపణలు
కోటేశ్వరరాజు వారిపై చేసిన ఆరోపణల మేరకు.. జోష్టర్ ఫిలిం సర్వీసెస్ నుంచి జీవితా రాజశేఖర్లు రూ.26 కోట్ల మేర అప్పు తీసుకుని..

నగరి : ప్రముఖ సినీ నటుడు రాజశేఖర్, ఆయన భార్య జీవిత పై జోష్టర్ ఫిలిం సర్వీసెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. రాజశేఖర్ త్వరలోనే జైలుకు వెళ్తారని ఆ సంస్థ డైరెక్టర్ కోటేశ్వర్ రాజు శుక్రవారం వ్యాఖ్యానించారు. జీవిత రాజశేఖర్ లు తమకు భారీ ఎత్తున మోసం చేశారన్న ఆయన.. ఈ కేసులో నగరి కోర్టు జీవిత రాజశేఖర్ పై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసిందని తెలిపారు.
కోటేశ్వరరాజు వారిపై చేసిన ఆరోపణల మేరకు.. జోష్టర్ ఫిలిం సర్వీసెస్ నుంచి జీవితా రాజశేఖర్లు రూ.26 కోట్ల మేర అప్పు తీసుకుని ఎగ్గొట్టారు. గరుడ వేగ సినిమా కోసం జీవితా రాజశేఖర్లు అప్పు అడిగితే జోష్టర్ ఫిలిం సర్వీసెస్ తమ ఆస్తులు తాకట్టు పెట్టుకుని డబ్బు సర్దుబాటు చేసింది. కానీ జీవిత రాజశేఖర్ ఆ అప్పును తిరిగి చెల్లించలేదు. ఆస్తులను బినామీల పేర్లమీదికి మార్చి మోసం చేశారు. ప్రస్తుతం వీరిపై చెక్ బౌన్స్ కేసు నడుస్తోంది.
Next Story

