Fri Dec 05 2025 16:39:44 GMT+0000 (Coordinated Universal Time)
John Wick : 'జాన్విక్' హీరో ఇంటిలో దొంగతనం.. కుక్కని ఏం చేయలేదు కదా.?
'జాన్విక్' మూవీలో ఒక చిన్న కుక్కపిల్లని చంపినందుకు మరణహోమాన్ని చేసిన హీరో 'కీను రీవ్స్' ఇంటిలో దొంగలు పడ్డారట. ఇది తెలుసుకున్న అభిమానులు..

John Wick : హాలీవుడ్ సూపర్ హిట్ యాక్షన్ మూవీ సిరీస్ 'జాన్విక్'కి వరల్డ్ వైడ్ గా ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాలో తను పెంచుకుంటున్న ఒక చిన్న కుక్కపిల్లని చంపినందుకు హీరో.. ఒక మరణహోమాన్ని మొదలుపెడతాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి నాలుగు పార్టీలు ఆడియన్స్ ముందుకు వచ్చాయి. చాప్టర్ 4 ఈ ఏడాది రిలీజ్ అయ్యింది. నాలుగు భాగాలు ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి.
కాగా ఈ సినిమాలో హీరోగా 'కీను రీవ్స్' నటించారు. 'మ్యాట్రిక్స్' మూవీ సిరీస్ తో ఫేమ్ ని సంపాదించుకున్న ఈ నటుడు 'జాన్విక్' సీరియస్ తో ఓ రేంజ్ స్టార్డమ్ ని అందుకున్నారు. తాజాగా ఈ నటుడు ఇంటిలోకి దొంగలు చొరబడ్డారట. హాలీవుడ్ హిల్స్ లాస్ ఏంజెల్స్ లో ఉన్న కీను రీవ్స్ నివాసంలో ఈ ఘటన జరిగింది. కొందరు వ్యక్తులు మొఖానికి మాస్క్ లు పెట్టుకొని ఇంటి కిటికీ పగలకొట్టి లోపలి చొరబడినట్లు సెక్యూరిటీ కెమెరాలో రికార్డు అయ్యింది.
ఇంటిలో ఉన్న ఒక తుపాకీని దొంగతనం చేసినట్లు సమాచారం. ఇంకేమేమి దొంగతనానికి గురయ్యాయి తెలియాల్సి ఉంది. దొంగతనం జరిగిన సమయంలో కీను రీవ్స్ ఇంట్లో లేరు. ఇక ఈ వార్త తెలుసుకున్న అభిమానులు.. ఈ ఘటన పై మీమ్స్ చేస్తూ నెటిజెన్స్ ని నవ్విస్తున్నారు. "దొంగతనంకి వెళ్తే వెళ్లారు. ఆయన కుక్కని ఏం చేయలేదు కదా..?" అంటూ మీమ్స్ చేసి నవ్విస్తున్నారు.
కాగా కీను రీవ్స్ ఇంటిలోకి ఇలా ఇతరులు చొరబడడం మొదటిసారి కాదు. 2014 టైంలో కూడా ఇలా రెండు సంఘటనలు జరిగాయి. ఇద్దరు మహిళలు రెండు రోజుల వ్యవధిలో కీను రీవ్స్ ఇంటిలో చొరబడి అరెస్ట్ అయ్యినట్లు హాలీవుడ్ మీడియా చెబుతుంది.
Next Story

