పింక్ లో లాయర్.. మరి క్రిష్ సినిమాలో..?
పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం పక్కా.. పింక్ రీమేక్ తో త్వరలోనే సెట్స్ మీదకి కూడా వెళ్లబోతున్నాడు. ఏపీ రాజకీయాల్లో కంటే పవన్ కళ్యాణ్ [more]
పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం పక్కా.. పింక్ రీమేక్ తో త్వరలోనే సెట్స్ మీదకి కూడా వెళ్లబోతున్నాడు. ఏపీ రాజకీయాల్లో కంటే పవన్ కళ్యాణ్ [more]

పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం పక్కా.. పింక్ రీమేక్ తో త్వరలోనే సెట్స్ మీదకి కూడా వెళ్లబోతున్నాడు. ఏపీ రాజకీయాల్లో కంటే పవన్ కళ్యాణ్ కి సినిమాలే కరెక్ట్ అంటున్నారు ఆయన రాజకీయ శత్రువులు. ఇక దిల్ రాజు నిర్మాణంలో పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ ని ఒప్పేసుకున్నాడు. మరోపక్క దర్శకుడు క్రిష్ చెప్పిన కథకు కనెక్ట్ అయ్యాడని.. క్రిష్ కూడా పవన్ కళ్యాణ్ కోసం ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్నాడని.. అది కూడా జానపద కథతో ఉండబోతుందనేది పాత న్యూసే.
ఇక పింక్ రీమేక్ లో పవన్ కళ్యాణ్ యంగ్ లాయర్ పాత్ర చెయ్యబోతుంటే.. ఇపుడు క్రిష్ సినిమాలో పవన్ కళ్యాణ్ చెయ్యబోయే పాత్ర ఇదే అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో రేజ్ అయ్యింది. మొఘలాయిల కాలానికి సంబందించిన కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓ దొంగ గా కనిపించబోతున్నట్టుగా టాక్. మహమ్మదీయుల పరిపాలనా కాలంనాటి పరిస్థితులను..కథగా మలిచి సినిమాగా మార్చబోతున్నాడట క్రిష్. ఇక ఈ కథ తో చెయ్యబోయే సినిమా కోసం ఆనాటి పరిస్థితులకు అద్దం పట్టే… భారీ సెట్స్ గట్రా వెయ్యాల్సి ఉంటుంది.. అలాగే స్క్రిప్ట్ పర్ఫెక్షన్ కోసం క్రిష్ కూడా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కి బాగా టైం తీసుకోబోతున్నాడట. ఇక ఈ కథకు సరిపోయే టైటిల్ కోసం క్రిష్ ఇప్పటినుండే కసరత్తులు మొదలెట్టినట్టుగా టాక్.

