Mon Mar 23 2026 05:29:42 GMT+0530 (India Standard Time)
జగపతిబాబు సీన్స్ సినిమాకే హైలైట్

డిఫరెంట్ టైప్ మూవీస్ చేసే నారా రోహిత్ మరో కొత్త కథతో 'ఆటగాళ్లు' అనే సినిమా ద్వారా మన ముందుకు రానున్నాడు. ఈ సినిమాను పరుచూరి మురళి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక నారా రోహిత్ కి విలన్ గా జగపతిబాబు నటిస్తున్నాడు.
సినిమాలో నారా రోహిత్.. జగపతి బాబు ఇద్దరు నువ్వా.. నేనా? అన్నట్టుగా పోటీపడి నటించారట. టైటిల్‌కు తగ్గట్టుగానే సినిమాలో వీరిద్దరి పాత్ర ఎంతో ఆసక్తికరంగా ఉంటుందంట.
ఈ ఇద్దరి నటన సినిమాకే హైలైట్ అని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. దర్శన కథానాయికగా నటించిన ఈ సినిమాను, వేసవిలో విడుదల చేయనున్నారు. త్వరలోనే సినిమా సాంగ్స్ రిలీజ్ చేయనున్నారు.
Next Story

