Thu Mar 19 2026 05:27:18 GMT+0530 (India Standard Time)
నడవలేని స్థితిలో జబర్దస్త్ కమెడియన్
జబర్దస్త్ పంచ్ ప్రసాద్ ఆరోగ్యం కుదుట పడుతుందనుకుంటున్న సమయంలో ఆయన రెండు కాళ్లు చచ్చుపడిపోయాయి

జబర్దస్త్ షో చూసే వారికి పంచ్ ప్రసాద్ అంటే తెలుసు. ఆయన పంచ్ లతో అందరినీ అలరించేవారు. ఆయన గత కొంత కాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. తన స్కిట్ లలో కిడ్నీలపైన కూడా పంచ్ లు వేసుకుని ప్రసాద్ అందరినీ నవ్వించే వారు. జబర్దస్త్ నటులు ప్రసాద్ ఆరోగ్యాన్ని కాపాడేందుకు సాయం కూడా అందించారు. ప్రసాద్ ఆరోగ్యం పై ఇతర కెమెడియన్లు కూడా పంచ్ లు వేసినా ఈజీగా తీసుకునే వారు.
పంచ్ ప్రసాద్ రెండు కాళ్లు...
ప్రసాద్ ఆరోగ్యం కుదుట పడుతుందనుకుంటున్న సమయంలో ఆయన రెండు కాళ్లు చచ్చుపడిపోయాయి. ఆయన నడవలేని స్థితికి చేరుకున్నారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరగడంతో కాళ్లు చచ్చుపడి పోయాయని జబర్దస్త్ టీం సభ్యులు తెలిపారు. ప్రసాద్ నడవలేని పరిస్థితుల్లో ఉన్న ఫొటోలను కొందరు జబర్దస్త్ టీం సభ్యులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ప్రసాద్ త్వరగా కోలుకుని పంచ్ లతో ప్రేక్షకులను అలరించాలని ఆశిస్తున్నారు.
Next Story

