అమల మరో రచ్చకి శ్రీకారం చుట్టిందా?
రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోస్ తో కలిసినటించిన తమిళ బ్యూటీ అమల పాల్ తెలుగులో క్లిక్ అవలేకపోయింది కానీ.. తమిళనాట మాత్రం ఎప్పుడు [more]
రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోస్ తో కలిసినటించిన తమిళ బ్యూటీ అమల పాల్ తెలుగులో క్లిక్ అవలేకపోయింది కానీ.. తమిళనాట మాత్రం ఎప్పుడు [more]
రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోస్ తో కలిసినటించిన తమిళ బ్యూటీ అమల పాల్ తెలుగులో క్లిక్ అవలేకపోయింది కానీ.. తమిళనాట మాత్రం ఎప్పుడు బిజినె. ప్రస్తుతం పలు సినిమాల్తో బిజీగా ఉండే ఈ తార.. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టీవ్. అయితే కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు దర్శకుడు విజయ్ ని ప్రేమించి పెళ్లాడిన అమల పాల్.. తర్వాత వెంటనే విడాకులు కూడా తీసుకుంది. అయితే అప్పటినుండి ఒంటరిగా సినిమాలు చేసుకుంటున్న అమల మొన్నామధ్యన తమిళ హీరో విష్ణు విశాల్ తో డేటింగ్ లో ఉందని.. విజయ్ తో విడాకుల తర్వాత విష్ణు విశాల్ తో అమల పాల్ ప్రేమాయణం నడుపుతుంది అంటూ కోలీవుడ్ మీడియాలో రచ్చ రచ్చ అయ్యింది. కానీ తాను అమలా పాల్‌తో డేటింగ్ చేయడం లేదని విష్ణు విశాల్ స్పష్టం చేశారు.
అది అలా ముగియగా తాజాగా అమల పాల్ మరో వ్యక్తితో డేటింగ్ లో ఉందని.. దాదాపుగా 2017 నుండి పంజాబీ కుర్రాడు భవీందర్ సింగ్ తో అమల పాల్ రహస్యంగా డేటింగ్ చేస్తున్నల్టుగా వార్తలు గుప్పుమన్నాయి. ఒక సోషల్ మీడియా ఆమె రహస్య డేటింగ్ గురించి ఊహాగానాలను పెంచింది. అమలా మరియు భవందర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో.. అమల పాల్ తాజా ప్రేమాయణం వెలుగులోకొచ్చింది అంటున్నారు. సోషల్ మీడియాలో ఆ పిక్స్ చూసిన వారు.. ఇద్దరూ రహస్యంగా డేటింగ్ చేస్తున్నారని అంటున్నారు. మరి ఈ విషయమై అమల పాల్ స్పందన కోసం సోషల్ మీడియా వేచి చూస్తుంది.