Mon Feb 02 2026 01:48:56 GMT+0000 (Coordinated Universal Time)
ఆగస్టు నుంచి సినిమా షూటింగ్ లు బంద్
టాలీవుడ్ లో ఆగస్టు నెల నుంచి సినిమా షూటింగ్ లు నిలిచిపోయే అవకాశం కన్పిస్తుంది.

టాలీవుడ్ లో ఆగస్టు నెల నుంచి సినిమా షూటింగ్ లు నిలిచిపోయే అవకాశం కన్పిస్తుంది. ముఖ్యంగా నిర్మాతలు నష్టాలపై ఆందోళన చెందుతున్నారు. ఓటీటీల్లో వెంటనే సినిమాలు విడుదల కావడం, థియేటర్లకు జనం తగ్గిపోవడం, సినిమా నిర్మాణ వ్యయం పెరగడంతో నష్టాలు చవి చూడాల్సి వస్తుందని నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు. వచ్చే నెల నుంచి షూటింగ్ లకు నిలిపివేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.
కీలక నిర్ణయాలు....
ఈ నెల 21వ తేదీన నిర్మాత మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యమైన అంశాలపై చర్చించనున్నారు. ఓటీటీలో పది వారాల తర్వాత సినిమాలు విడుదల చేసే విధంగా తీర్మానం చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. రెమ్యునరేషన్ కూడా తగ్గించాలని విజ్ఞప్తి చేయనున్నారు. ఉత్పత్తి వ్యయంతో పాటు నిర్మాణ సమయంలో జరుగుతున్న అదనపు వ్యయాన్ని కూడా నియంత్రించేలా చర్యలు తీసుకునేందుకు నిర్మాతలు సిద్ధమయ్యారు.
Next Story

