Thu Mar 19 2026 02:07:25 GMT+0530 (India Standard Time)
మూవీ టిక్కెట్ వర్సెస్ టమాటా... నవదీప్ సెటైర్
ఆంధ్రప్రదేశ్ లో ఆన్ లైన్ లో సినిమా టిక్కెట్ల విక్రయాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి

ఆంధ్రప్రదేశ్ లో ఆన్ లైన్ లో సినిమా టిక్కెట్ల విక్రయాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు దీనిని సమర్థిస్తుండగా, మరికొందరు దీనిని వ్యతిరేకిస్తున్నారు. అన్ని సినిమాలకు ఒకేరకమైన టిక్కెట్లు ఖరారు చేయడం కరెక్ట్ కాదంటున్నారు. అయితే జగన్ ప్రభుత్వం మాత్రం అసెంబ్లీలో దీనిపై బిల్లును కూడా తీసుకొచ్చింది. పెద్ద సినిమాలకు దీనివల్ల భారీగా నష్టం వాటిల్లుతుందన్న అభిప్రాయాలు టాలివుడ్ లో వ్యక్తమవుతుంది.
ట్వీట్ వైరల్....
ఇదే సమయంలో సినీనటుడు నవదీప్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. టామాటా రేటుతో మూవీ టిక్కెట్ ధరను పోలుస్తూ ఆయన ట్వీట్ చేశారు. సినిమా టిక్కెట్ వర్సెస్ టమాటా అంటూ నవదీప్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
Next Story

