Thu Jan 29 2026 04:35:17 GMT+0000 (Coordinated Universal Time)
మాటలు రావడం లేదు
శాస్త్రి గారి మరణంతో తనకు మాటలు రావడం లేదని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అన్నారు

శాస్త్రి గారి మరణంతో తనకు మాటలు రావడం లేదని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అన్నారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి పార్ధీవ దేహానికి ఆయన నివాళులర్పించారు. ఆయన పాటలు విని తాను పెరిగానని చెప్పారు. తమ కుటుంబానికి ఎంతో ఇష్టమైన వ్యక్తి సీతారామ శాస్త్రి అని అల్లు అర్జున్ అన్నారు.
ప్రతి పాట...
ఆయన ప్రతి పాట ఎంతో విలువైనదని, ఆయన రాసిన ఏ పాటను బాగాలేదని అనలేకపోవడమే ఆయన కలానికి ఉన్న పదునకు నిదర్శనమని అల్లు అర్జున్ కీర్తించారు. అటువంటి అరుదైన వ్యక్తులను తెలుగు చలన చిత్ర పరిశ్రమ కోల్పోవడం బాధాకరమని, శాస్త్రిగారి మృతి చిత్ర పరిశ్రమకే కాకుండా వ్యక్తిగతంగా తనకు తీరని లోటు అని అల్లు అర్జున్ అన్నారు.
Next Story

