నన్ను చాలా మంది వేధించారు..!
సినిమా ఇండస్ట్రీలో మీ టూ ఉద్యమం గత రెండేళ్లుగా బాగా యాక్టీవ్ లో ఉంది. మీ టూ అంటూ చాలామంది మాజీ, ప్రెజెంట్ హీరోయిన్స్ మీడియా ముందు [more]
సినిమా ఇండస్ట్రీలో మీ టూ ఉద్యమం గత రెండేళ్లుగా బాగా యాక్టీవ్ లో ఉంది. మీ టూ అంటూ చాలామంది మాజీ, ప్రెజెంట్ హీరోయిన్స్ మీడియా ముందు [more]
సినిమా ఇండస్ట్రీలో మీ టూ ఉద్యమం గత రెండేళ్లుగా బాగా యాక్టీవ్ లో ఉంది. మీ టూ అంటూ చాలామంది మాజీ, ప్రెజెంట్ హీరోయిన్స్ మీడియా ముందు నోరు విప్పుతున్నారు. కానీ మిమ్మల్ని లైంగికంగా వేధించింది ఎవరు అంటే మాత్రం చెప్పరు. కారణం మళ్ళి ఎక్కడ అవకాశాలు రావో అని వారి భయం. తాజాగా తెలుగులో మెగా హీరో తో చేసిన సినెమాలతో గుర్తింపు తెచ్చుకున్న రెజినా కాసాండ్రా తెలుగు, తమిళ సినిమాల్లో కాస్త బిజీగానే ఉంది. తెలుగులో ఆఫర్స్ తగ్గాక తమిళం వైపు మళ్ళిన రెజినా తాను కూడా ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఎదుర్కున్నాని చెబుతుంది.
తాను ఇండస్ట్రీలోకి వచ్చాక రెండుమూడుసార్లు లైంగికంగా వేధించారని.. తనని లొంగ తీసుకునేందుకు చాలామంది ప్రయత్నించారని.. అంటూ సంచలనంగా మాట్లాడింది. అసలు తనని ఓ యువకుడు పబ్లిక్ గానే వేధించాడని.. ఆ యువకుడిని పది మందిలోను పబ్లిక్ గానే కొట్టానని చెబుతుంది రెజినా. అయితే తనని ఇండస్ట్రీలో వేధించిన వారి పేర్లు బయటపెట్టడానికి మాత్రం రెజినా నిరాకరించింది. మరి చిన్న హీరోయిన్ అయినా,, పెద్ద హీరోయిన్ అయినా ఇండస్ట్రీలో ఎదగడానికి ఇలాంటి పనులు చెయ్యక తప్పదేమో అనిపించేలా ఉంటున్నాయి ఇలాంటి హీరోయిన్స్ చేసే కామెంట్స్.
- Tags
- Regina Cassandra