ఒంటరిగా ఉండడమే ఇష్టం అంటున్న హీరోయిన్?
తెలుగులో గబ్బర్ సింగ్, రేసు గుర్రం లాంటి హిట్స్ ఉన్న శృతి హాసన్ కాటమరాయుడు తర్వాత సినిమాలకు దూరమయ్యింది. మ్యూజిక్ , నటన అంటే ఇష్టపడే శృతి [more]
తెలుగులో గబ్బర్ సింగ్, రేసు గుర్రం లాంటి హిట్స్ ఉన్న శృతి హాసన్ కాటమరాయుడు తర్వాత సినిమాలకు దూరమయ్యింది. మ్యూజిక్ , నటన అంటే ఇష్టపడే శృతి [more]
తెలుగులో గబ్బర్ సింగ్, రేసు గుర్రం లాంటి హిట్స్ ఉన్న శృతి హాసన్ కాటమరాయుడు తర్వాత సినిమాలకు దూరమయ్యింది. మ్యూజిక్ , నటన అంటే ఇష్టపడే శృతి హాసన్ బాయ్ ఫ్రెండ్ దొరికాక సినిమాలను లైట్ టీయూస్కుంది. తండ్రి కమల్ హాసన్ ని ఒప్పించి బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకుంటుంది అనుకున్న సమయంలో శృతి హాసన్ మళ్ళీ సింగిల్ గా కనబడింది. బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయ్యాక మల్లి సినిమాలపై దృష్టి సారించిన శృతి హాసన్ కి ఒంటరి తనం అంటే చాలా ఇష్టమట. అందుకే కరోనా లాక్ డౌన్ సమయంలోను శృతి హాసన్ ఒంటరిగా గడిపినా అస్సలు బోర్ కొట్టలేదని చెబుతుంది.
అయితే శృతి హాసన్ ఒంటరిగా ఉంటూనే ఇంటి పని చేసుకోవడం అలవాటట. ఇంట్లోని బట్టలు ఉతకడం, గిన్నెలు తోమడం దగ్గరనుండి ఇల్లు శుభ్రం చేసేవరకు శృతి హాసన్ తన ఇంటి పని తానే చేసుకుంటుదట. ఆ విషయం స్వయానా శృతినే చెబుతుంది. అయితే సెలబ్రిటీస్ అంటే ఇంటి నిండా పని మనుషులు ఉంటారు.. అలాంటి వాళ్ళు ఇలాంటి ఇంటిపనులు కూడా చేస్తారా అంటూ చాలామంది ఆశ్చర్యపోతుంటారు.. కానీ మేము మనుషులమే గా అంటుంది. లాక్ డౌన్ లో ఇంటి పనులు, అంట్లు తోమడం, బట్టలుతకడం విషయంలో ఛాలెంజ్ లు చేసుకున్నారు.. ఇలాంటి పనులు చెయ్యడం ఓ ఛాలెంజ్ అంటారా అంటుంది శృతి హాసన్. ఇక తనకి ఒంటరిగా ఉండడమే ఇష్టమని.. కొంతమంది ఒంటరిగా ఉండడమంటే భయపడతారని.. కానీ తాను చాలా రోజులుగా ఒంటరిగానే ఉంటున్నట్లుగా చెప్పుకొచ్చింది.
- Tags
- shruthi hasan