మ్యాగీ నూడిల్స్ నాకన్నా ఎవరూ బాగా చెయ్యలేరు!!
చిన్నపిల్లలు కూడా పొయ్యి మీద గిన్నె పెట్టి నీళ్లు పోసి కుక్ చేసుకుని తినే ఈజీ ఐటెం ఏదయ్యా అంటే మ్యాగీ నూడిల్స్. అలాంటి వంటకాన్ని నాకన్నా [more]
చిన్నపిల్లలు కూడా పొయ్యి మీద గిన్నె పెట్టి నీళ్లు పోసి కుక్ చేసుకుని తినే ఈజీ ఐటెం ఏదయ్యా అంటే మ్యాగీ నూడిల్స్. అలాంటి వంటకాన్ని నాకన్నా [more]
చిన్నపిల్లలు కూడా పొయ్యి మీద గిన్నె పెట్టి నీళ్లు పోసి కుక్ చేసుకుని తినే ఈజీ ఐటెం ఏదయ్యా అంటే మ్యాగీ నూడిల్స్. అలాంటి వంటకాన్ని నాకన్నా ఎవరూ బాగా చెయ్యలేరు అంటున్నాడు ఓ స్టార్ హీరో. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మీ పిల్లలకు ఇంట్రెస్ట్ గా వండి పెట్టె బెస్ట్ డిష్ ఏమిటి అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు మహేష్ చెప్పిన సమాధానం. మ్యాగీ నూడిల్స్ అంటూ నవ్వేయ్యడం. కృష్ణగారి పుట్టిన రోజు న కొత్త సినిమాని ప్రకటించిన మహేష్ ఆ రోజు సాయంత్రం సోషల్ మీడియాలో అభిమానులల్తో చిట్ చాట్ చేసాడు. అందులో భాగంగా మహేష్ అభిమానులు అడిగిన ప్రశ్నలకు నవ్వుతూ సమాధానాలు చెప్పాడు. మహేష్ బాబు ఫెవరెట్ కలర్ బ్లు అని చెప్పిన మహేష్ కి ఇష్టమైన ఫుడ్ హైదరాబాద్ బిర్యానీ అని చెబుతున్నాడు.
ఇక లాక్ డౌన్ లో ఫ్యామిలీ తో గడపడమే తనకి లైఫ్ లో బెస్ట్ మూమెంట్ అంటున్నాడు. సితార, గౌతమ్ లతో గడపడం జీవితానికి సరిపడా ఎక్సపీరియెన్స్ అంటున్నాడు. సితార, గౌతమ్ లతో చాల చేశాను. వారితో ఆడుకున్నాను. ఇక తనకి ఇష్టమైన గేమ్ ఏమిటి అని అడిగితె.. నేను బాగా ఎంజాయ్ చేసేది ఆన్ లైన్ లో మా అబ్బాయి గౌతమ్ తో ఆడే టెన్నిస్, బేస్ బాల్, గోల్ఫ్. ఇవి బాగా ఇష్టపడతాను అన్న మహేష్ లాక్ డౌన్ లో షూటింగ్స్ ని బాగా మిస్ అవుతున్నాడట. తాజాగా మొదలైన పరశురామ్ మూవీ ని ఎప్పుడు విడుదల చెయ్యబోతున్నారు అనగానే.. ముందున్న ఈ క్లిష్ట పరిస్థితులు తొలిగి పోనివ్వండి.. ఆ తర్వాత సినిమా రిలీజ్ గురించి ఆలోచిద్దాం అంటున్నాడు.
- Tags
- mahesh babu