Sat Dec 07 2024 17:32:41 GMT+0000 (Coordinated Universal Time)
నేనే హీరోకి కమిట్ అవ్వలేదు బాబోయ్?
ప్రతి రోజు పండగే సినిమా హిట్ తర్వాత మారుతీ ఆ హీరోకి కమిట్ అయ్యాడు. ఈ హీరోకి కమిట్ అయ్యాడంటూ వార్తలోస్తున్నాయి. రవితేజ దగ్గరనుండి రామ్ వరకు [more]
ప్రతి రోజు పండగే సినిమా హిట్ తర్వాత మారుతీ ఆ హీరోకి కమిట్ అయ్యాడు. ఈ హీరోకి కమిట్ అయ్యాడంటూ వార్తలోస్తున్నాయి. రవితేజ దగ్గరనుండి రామ్ వరకు [more]
ప్రతి రోజు పండగే సినిమా హిట్ తర్వాత మారుతీ ఆ హీరోకి కమిట్ అయ్యాడు. ఈ హీరోకి కమిట్ అయ్యాడంటూ వార్తలోస్తున్నాయి. రవితేజ దగ్గరనుండి రామ్ వరకు మారుతీ సినిమా చేస్తున్నాడంటూ.. వార్తలు రావడమే కానీ.. అటు హీరోలు కానీ ఇటు మారుతీ కానీ కన్ఫర్మ్ చెయ్యలేదు. తాజాగా రెడ్ సినిమా తర్వాత రామ్ మారుతీ తో సినిమా చేస్తున్నాడట అని.. అయితే మాస్ కాకుండా ఫ్యామిలీ స్టోరీ తో కథ రాయమని రామ్ మారుతీ కి చెప్పినట్టుగా వార్తాలొచ్చాయి. రెండు మాస్ సినిమాలు తర్వాత ఓ క్లాస్, కుటుంబ కథ చిత్రం చేద్దామని మారుతీ తో రామ్ చెప్పినట్టుగా అన్నారు.
అయితే తాజాగా మారుతీ మాత్రం నేనే హీరోకి కమిట్ అవ్వలేదు అంటున్నాడు. ప్రతి రోజు పండగే సినిమా తర్వాత నేను ఏ హీరోకి కథ వినిపించలేదని, నేను కథని ప్రిపేర్ చేస్తూ స్క్రిప్టు పనులు జరుగుతూనే ఉన్నాయని, అన్నీ పూర్తయ్యాక తానే హీరో ఎవరన్నది చెబుతానని.. ఈ న్యూస్ మాత్రమే నిజమని.. నా నెక్స్ట్ సినిమాపై నేను చెప్పే వరకు ఎలాంటి న్యూస్ నమ్మొద్దు అంటూ.. చెబుతున్నాడు. మరి మారుతీ మైండ్ లో ఏ హీరో లేకుండానే మారుతీ కథ రాసుకున్నాడా.. లేదంటే కథని బట్టి హీరోని సెట్ చేసుకుంటాడా అనేది చూడాలి.
Next Story