Sun Dec 08 2024 21:56:13 GMT+0000 (Coordinated Universal Time)
Hit 2 Teaser : అడవి శేష్, నాని ఖాతాలో మరో హిట్ ఖాయం
తాజాగా Hit 2 టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ లో అడవి శేష్ క్యారెక్టర్ గురించే ఎక్కువగా చూపించారు. కేసు మొదలు..
నేచురల్ స్టార్ నాని నిర్మాతగా.. శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్సేన్ హీరోగా 2020లో వచ్చిన సినిమా Hit : The First Case. ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని అప్పుడే చెప్పింది చిత్రయూనిట్. చెప్పినట్టుగానే Hit 2 సినిమాని తీస్తున్నారు. ఈ సీక్వెల్ లో అడివి శేష్ హీరోగా నటిస్తుండగా.. మీనా క్షి చౌదరి, కోమలీ ప్రసాద్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. Hit 2ని కూడా శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తుండగా.. నాని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమాని డిసెంబర్ 2వ తేదీన విడుదల చేయనున్నారు.
తాజాగా Hit 2 టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ లో అడవి శేష్ క్యారెక్టర్ గురించే ఎక్కువగా చూపించారు. కేసు మొదలు పెట్టకు ముందు అడివి శేష్ ఇంట్రో, అడివి శేష్ ఎలా ఉంటాడో చూపించారు. ఒక అమ్మాయి హత్యతో సెకండ్ కేస్ మొదలవుతుంది. ఆ అమ్మాయి అంత కిరాతకంగా ఎవరు, ఎందుకు చంపారన్నది సస్పెన్స్. టీజర్లో పెద్దగా థ్రిల్లర్ అంశాలేవీ లేవు. టీజర్ లో ఏమీ చూపించం.. అంతా సినిమాలోనే చూడాలన్నట్టుగా ఉంది టీజర్. దాంతో ఆడియన్స్ లో సినిమా చూడాలన్న ఆసక్తి పెరుగుతోంది. హిట్ సెకండ్ కేస్ సినిమా ఫుల్ సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో ఉండబోతోందని తెలుస్తోంది. ఈ సినిమాతో అడివి శేష్, నాని ల ఖాతాలో మరో హిట్ ఖాయమని తెలుస్తోంది.
Next Story