Thu Mar 19 2026 02:01:37 GMT+0530 (India Standard Time)
పెళ్లిపీటలు ఎక్కనున్న హీరో, హీరోయిన్

బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే, రణవీర్ సింగ్ లు త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. ఇప్పటికే వీరి పెళ్లిపై అనేక వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే, తాజాగా ముంబైలోని బాంద్రాలో ఆమె తన తల్లి ఉజాలా పదుకొనేతో కలిసి సంప్రదాయ ఆభరణాలు కొనుగోలు చేసిందంట. అయితే, ఈ ఆభరణాలు ఆమె పెళ్లి కోసమే అనే ప్రచారం జరుగుతోంది. గత కొన్ని రోజులుగా వీరి పెళ్లిపై ఓ రేంజ్ లో పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ సంవత్సరం జనవరీలో దీపిక, రణవీర్ తల్లిదండ్రులు కలిసి ఇప్పటికే పెళ్లి సంబంధం సెట్ చేశారని వినిపిస్తోంది. దీపిక 32వ పుట్టిన రోజు సందర్భంగా జనవరీలో ఆమె ఇంటికి వెళ్లిన రణవీర్ కుటుంబం కలిసి పార్టీ చేసుకున్నారట. అంతేకాదు, దీపికకు పుట్టినరోజు కానుకగా ఖరీదైన డైమెండ్ సెట్, చీర ఇచ్చారు. దీంతో వీరి పెళ్లిపై వార్తలు నిజమేనని స్పష్టమవుతోంది.

Next Story

