Fri Dec 05 2025 09:06:14 GMT+0000 (Coordinated Universal Time)
శాండిల్ వుడ్ ఆగ్రహం... రష్మిక పై బ్యాన్?
శాండిల్ వుడ్ లో హీరోయిన్ రష్మిక కు కష్టాలు ప్రారంభమయినట్లే కనిపిస్తుంది, ఆమెపై బ్యాన్ పెట్టాలని యోచిస్తున్నారు

శాండిల్ వుడ్ లో హీరోయిన్ రష్మిక కు కష్టాలు ప్రారంభమయినట్లే కనిపిస్తుంది. కన్నడ చిత్ర పరిశ్రమలో రష్మిక ను బ్యాన్ చేసే ఆలోచనల పలువురు ఉన్నారని సమాచారం. ఇందుకు ఆమె చేసిన వ్యాఖ్యలే కారణం అని తెలుస్తుంది. కన్నడ భాష, కన్నడ సినిమాల పట్ల రష్మిక చేసిన వ్యాఖ్యలతో కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాంతారా సినిమాపై....
సోషల్ మీడియాలో రష్మికను ట్రోల్ చేస్తున్నారు. రష్మికను బ్యాన్ చేయాలంటూ వారు కామెంట్స్ పెడుతున్నారు. గతంలో తనకు మాతృభాష రాదని చెప్పడమే కాకుండా, తాజాగా కాంతారా సినిమా పై రష్మిక చేసిన వ్యాఖ్యలకు కన్నడిగులు మండిపడుతున్నారు. మరి శాండిల్ వుడ్ లో రష్మిక కు కష్టాలు తప్పేట్లు లేవన్నది వినిపిస్తున్న టాక్.
Next Story

