Fri Mar 20 2026 23:20:54 GMT+0530 (India Standard Time)
కర్ణాటకలో గుర్రాల వ్యాపారం జరుగుతోందట

కర్ణాటకలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులపై నటి, కాంగ్రెస్ నాయకురాలు రమ్య స్పందించారు. కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ గుర్రాల వ్యాపారం ప్రారంభించిందని, కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను గుర్రాల మాదిరి కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తుందని తనదైన శైలిలో ఆమె వ్యాఖ్యానించారు. గత గుజరాత్ రాజ్యసభ ఎన్నికల సందర్భంలోనూ కేంద్రమంత్రి పియూష్ గోయల్ కొందరు వ్యాపారుల ద్వారా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయించేందుకు ప్రయత్నించారని, ఇప్పుడు కర్ణాటకలోనూ అదే పని చేస్తున్నారని ఆమె ఆరోపణలు చేశారు.
Next Story

