Fri Dec 05 2025 19:59:18 GMT+0000 (Coordinated Universal Time)
Rashmika : వీల్ ఛెయిర్ లో రష్మిక.. వీడియో వైరల్
హీరోయిన్ రహ్మిక మంథన వీల్ ఛెయిర్ లో వెళుతూ హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి

హీరోయిన్ రహ్మిక మంథన వీల్ ఛెయిర్ లో వెళుతూ హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆమె ఇటీవల జిమ్ చేస్తుండగా కాలికి తీవ్ర గాయమయింది. ఆ విషయం రష్మిక తెలిపారు. తాను కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని, అభిమానులు ఆందోళన చెందాల్సిన పనిలేదని కూడా ఆమె పోస్టు పెట్టారు.
హైదరాబాద్ ఎయిర్ పోర్టులో...
అయితే తాజాగా హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ముంబయికి వెళ్లేందుకు రష్మిక మంధన హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చారు. ఆమె కుంటుకుంటూ తన కారులో నుంచి దిగి వీల్ ఛెయిర్ లో కూర్చున్నారు. అక్కడి నుంచి సిబ్బంది ఆమెను వీల్ ఛెయిర్ లో ఎయిర్ పోర్టులోకి తీసుకెళ్లారు. దీంతో రష్మిక కోలుకోవడానికి మరికొంత సమయం పట్టే అవకాశాలున్నట్లు కనిపిస్తుంది. రష్మిక త్వరగా కోలుకోవాలంటూ ఆమె అభిమానులు ప్రార్థిస్తున్నారు.
Next Story

