Fri Dec 05 2025 11:13:06 GMT+0000 (Coordinated Universal Time)
అనుపమకు కరోనా పాజిటివ్.. టెన్షన్ లో కార్తికేయ 2 టీమ్
అనుపమకు కరోనా సోకడం ఆమె అభిమానులకు, చిత్ర యూనిట్ కు షాకిచ్చింది. సినిమా ప్రమోషన్స్ కోసం.. కార్తికేయ-2 టీమ్‌తో కలిసి..

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ - మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ నటించిన కార్తికేయ 2 ఇటీవలే విడుదలై... ఊహించని రీతిలో వసూళ్లు రాబడుతోంది. కార్తికేయ 2 హిట్ అవడంతో.. చిత్ర యూనిట్ మొత్తం సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది. చాలా రోజుల తర్వాత అనుపమ ఖాతాలో హిట్ పడటంతో.. అమ్మడి ఆనందానికి అవధుల్లేవు. ఆ ఆనందానికి కరోనా బ్రేక్ వేసింది. జలుబు, దగ్గు ఉండటంతో కరోనా పరీక్షలు చేయించుకోగా.. పాజిటివ్ గా తేలిందట. వెంటనే అనుపమ తన ఇంట్లోనే ఐసోలేట్ అయింది.
అనుపమకు కరోనా సోకడం ఆమె అభిమానులకు, చిత్ర యూనిట్ కు షాకిచ్చింది. సినిమా ప్రమోషన్స్ కోసం.. కార్తికేయ-2 టీమ్‌తో కలిసి అనుపమ, సౌత్, నార్త్ ఇలా తేడా లేకుండా ఇండియావైడ్ ప్రమోషన్స్‌లో బిజీగా మారింది. తనకు కరోనా సోకడంతో.. ఇటీవల తాను కలిసిన వారు, తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరింది. కాగా.. అనుపమ మరోసారి నిఖిల్ సరసన 18 పేజీస్ సినిమాలో నటిస్తోంది. అనుపమకు కరోనా సోకడంతో.. ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
Next Story

