మెహ్రీన్ టైం స్టార్ట్
కృష్ణగాడి వీర ప్రేమగాధ, రాజా ది గ్రేట్ , మహానుభావుడు సినిమాల్తో క్రేజీ హీరోయిన్ అవుతుంది అనుకుంటే.. మెహ్రీన్ కౌర్ మాత్రం మీడియం అండ్ యంగ్ హీరోలతోనే [more]
కృష్ణగాడి వీర ప్రేమగాధ, రాజా ది గ్రేట్ , మహానుభావుడు సినిమాల్తో క్రేజీ హీరోయిన్ అవుతుంది అనుకుంటే.. మెహ్రీన్ కౌర్ మాత్రం మీడియం అండ్ యంగ్ హీరోలతోనే [more]
కృష్ణగాడి వీర ప్రేమగాధ, రాజా ది గ్రేట్ , మహానుభావుడు సినిమాల్తో క్రేజీ హీరోయిన్ అవుతుంది అనుకుంటే.. మెహ్రీన్ కౌర్ మాత్రం మీడియం అండ్ యంగ్ హీరోలతోనే సర్దుకుపోవాల్సి వస్తుంది కానీ.. అమ్మడుకు స్టార్ అవకాశాలు మాత్రం రాలేదు. అయినా.. ఒకటి రెండు సినిమాలతో బిజీగా వుండే మెహ్రీన్ ముచ్చట్లు ఈ మధ్యన పెద్దగా వినిపించడం లేదు. అయితే ఇప్పుడు రేండు సినిమాలతో మెహ్రీన్ కౌర్ ఊపులోకొచ్చింది. ఒకటి సంక్రాంతికి విడుదలకాబోతున్న ఎంత మంచివాడవురా సినిమాతోనూ, మరొకటి అశ్వద్ధామ సినిమాలో నటిస్తున్న మెహ్రీన్ ఆ సినిమా పోస్టర్స్ తో పాటుగా, సాంగ్ లిరిక్స్ తో ప్రమోట్ అవుతుంది.
సోషల్ మీడియాలో…..
ఇక నాగ శౌర్య – మెహ్రీన్ జంటగా ఐరా క్రియేషన్స్ లో తెరకెక్కుతున్న అశ్వద్ధామ సినిమా జనవరి 30 న విడుదలకు డేట్ ఇవ్వడం, ఆ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ కావడం జరిగింది. మరి అశ్వద్ధామ సినిమాలో నాగ శౌర్య తో రొమాంటిక్ పోస్టర్స్ తో మెహ్రీన్ కౌర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి జనవరిలో ఒకటి కాదు రెండు సినిమాలతో మెహ్రీన్ హడావిడి మొదలవుతుంది. ఇప్పటికే రెండు సినిమా ప్రమోషన్స్ తో మెహ్రీన్ కౌర్ బాగా హైలెట్ అవుతుంది. అయితే మెహ్రీన్ కౌర్ కి అవకాశాలు అట్టే రాకపోవడానికి ఆమె లక్కు ఒక కారణమైతే.. మరొకటి మెహ్రీన్ గ్లామర్ షో చెయ్యదు కాబట్టే… దర్శక,నిర్మాతలెవరు మెహ్రీన్ జోలికెళ్లడం లేదు.