హీరోలను భయపెట్టిన సీరియల్స్!!
కరోనా లాక్ డౌన్ తో ఇళ్లకే పరిమితమైన స్టార్స్ అంత.. ఫ్యామిలీతో టైం స్పెండ్ చెయ్యడమే కాదు.. కొత్త కథలను ఫోన్ లోనే వింటున్నారు. దర్శకులు నేరేట్ [more]
కరోనా లాక్ డౌన్ తో ఇళ్లకే పరిమితమైన స్టార్స్ అంత.. ఫ్యామిలీతో టైం స్పెండ్ చెయ్యడమే కాదు.. కొత్త కథలను ఫోన్ లోనే వింటున్నారు. దర్శకులు నేరేట్ [more]
కరోనా లాక్ డౌన్ తో ఇళ్లకే పరిమితమైన స్టార్స్ అంత.. ఫ్యామిలీతో టైం స్పెండ్ చెయ్యడమే కాదు.. కొత్త కథలను ఫోన్ లోనే వింటున్నారు. దర్శకులు నేరేట్ చేసే కథలను వింటున్న హీరోలంతా ఎప్పుడెప్పుడు షూటింగ్ స్పాట్ కి వెళ్దామా అని అస్సలు ఎదురు చూడడం లేదు. కారణం కరోనా భీబత్సం. కరోనా ఉదృతి కొనసాగుతున్న టైం లో షూటింగ్ కి ఆనుమతులొచ్చినా స్పాట్ కి వెళేళ్దుకు ఏ హీరో మొగ్గు చూపడం లేదు. ఆగష్టు నుండి హీరోలకంతా తమ తమ సినిమా సెట్స్ లోకి వెళతారని చెబుతున్నారు. కొంతమంది ఆగష్టు టార్గెట్ గా సిద్ధమవుతున్నారు కూడా. కానీ ఇప్పుడు వాళ్ళని సీరియల్స్ షూటింగ్స్ బాగా భయపెట్టేశాయి.
టాలీవుడ్ లో షూటింగ్స్ కి ఆనుమతులు రావడం తరువాయి.. తెలుగు, హిందీ, తమిళ సీరియల్స్ షూటింగ్స్ పొలోమంటూ మొదలయ్యాయి. మూడు నెలల గ్యాప్ తర్వాత సెట్స్ మీదకెళ్ళిన ఆర్టిస్ట్ లు మొదటి రెండు రోజులు మంచి ఉత్సాహంగా కనిపింఛారు. కానీ తర్వాత నుండి ఒక్కో సీరియల్ షూటింగ్ లో ఒక్కో కరోనా పాజిటివ్ లు రావడంతో మొత్తం యూనిట్ తల పట్టుకుని టెస్ట్ లు చేయించుకుని మరీ హోమ్ క్వారంటైన్ కి వెళ్లారు. జీ తెలుగు మొదలు మా టివి సీరియల్స్ లో నటించే నటులకు కరోనా పాజిటివ్ రావడంతో.. ఆగష్టు నుండి సినిమా షూటింగ్స్ కి హాజరవుదామనుకున్న హీరోలంతా ఇప్పుడు మల్లి గప్ చుప్ అంటున్నారట. సీరియల్స్ కె అలా ఉంటె.. సినిమా షూటింగ్స్ లో వందలాదిమంది పని చెయ్యాలి. అలాంటప్పుడు కరోనా కట్టడి అసాధ్యం. అందుకె ఆగష్టు లో కూడా సినిమా షూటింగ్స్ మొదలయ్యే ఛాన్స్ లేదని అంటున్నారు.