Wed Dec 17 2025 12:48:40 GMT+0000 (Coordinated Universal Time)
ఆ చెక్ ను పంపేశా.. విశ్వక్ సేన్ వివరణ
తనకు సెట్ లో గౌరవం లేకుండా పోయిందని, అందుకనే తాను షూటింగ్ కు గైర్హాజరయ్యానని హీరో విశ్వక్ సేన్ తెలిపారు

తనకు సెట్ లో గౌరవం లేకుండా పోయిందని, అందుకనే తాను షూటింగ్ కు గైర్హాజరయ్యానని హీరో విశ్వక్ సేన్ తెలిపారు. చిన్న చిన్న సూచనలను తాను చేసినా అర్జున్ పట్టించుకోలేదని తెలిపారు. అంతా తాను చెప్పినట్లే నడుచుకోవాలని అర్జున్ చెప్పడంతోనే తాను హర్ట్ అయ్యానని విశ్వక్ సేన్ చెప్పారు.
నచ్చని పని చేయలేకనే...
తన మనసుకు నచ్చని పని చేయలేక సినిమా నుంచి తాను బయటకు వచ్చానని విశ్వక్ సేన్ వివరణ ఇచ్చుకున్నారు. ఈ సినిమాకు సంబంధించిన రెమ్యునరేషన్, చెక్ లు, డాక్యుమెంట్లు, నిర్మాత మండలికి పంపినట్లు ఆయన తెలిపారు. చిన్న చిన్న మార్పులకు కూడా అర్జున్ పట్టించుకోకపోవడంపై తాను కలత చెందానని తెలిపారు.
- Tags
- vishwak sen
- arjun
Next Story

