Sat Jan 31 2026 20:38:37 GMT+0000 (Coordinated Universal Time)
హీరో విశాల్ అరెస్ట్..!

తమిళ నిర్మాత మండలిలో విభేదాలు తారస్థాయికి చేరాయి. విశాల్ వ్యతిరేక వర్గీయులకు, విశాల్ కి నడుమ వివాదం తీవ్రమవుతోంది. పైరసీని అరికట్టడంలో విశాల్ తీవ్రంగా విఫలమయ్యారని, ఆయన వెంటనే రాజీనామా చేయాలని ఆయన వైరి వర్గం డిమాండ్ చేస్తోంది. నిన్న నిర్మాతల మండలి కార్యాలయం ముందు పలువురు నిర్మాతలు ఆందోళన చేసి తాళం వేశారు. దీంతో ఇవాళ విశాల్ తన మద్దతుదారులతో కలిసి తాళాలు పగలగొట్టి కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు విశాల్ ను అరెస్ట్ చేశారు. దీంతో విశాల్ టార్గెట్ గా ఆయన వ్యతిరేక వర్గీయులు పావులు కదుపుతున్నారు. పైరసీ సినిమాల వెబ్ సైట్ తమిళ రాకర్స్ లో విశాల్ కి షేర్ ఉందని కూడా కొందరు ఆరోపణలు చేస్తున్నారు.
Next Story

