Mon Dec 29 2025 01:22:06 GMT+0000 (Coordinated Universal Time)
ఆసక్తి కలిగిస్తున్న సర్కార్ ట్రైలర్

అతనొక కార్పొరేట్ మోన్స్టర్. అతను ఏ దేశం వెళ్లినా అక్కడ ఎదిరించిన వాళ్లను అంతం చేస్తాడు. ఎలక్షన్ల కోసం ఇప్పుడతను ఇండియాకి వచ్చాడు. పని గట్టుకుని ఎలక్షన్ల కోసం ఇండియాకు రావడానికి కారణమేంటి..? భారత్‌లో ఏం చేశాడు అన్నది తెరపైనే చూడాలంటున్నారు అశోక్ వల్లభనేని. విజయ్ హీరోగా ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వం వహించిన 'సర్కార్' చిత్రాన్ని ఆయన తెలుగులో విడుదల చేస్తున్నారు. తమిళంలో సన్ పిక్చర్స్ పతాకంపై కళానిథి మారన్ నిర్మించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్, వరలక్ష్మి శరత్‌కుమార్ కథానాయికలు. దీపావళి సందర్భంగా వచ్చేనెల 6న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేశారు.
Next Story

