Fri Mar 06 2026 08:53:53 GMT+0530 (India Standard Time)
అమ్మాయి వీపుపై విజయ్ దేవరకొండ.. స్పెషల్ ఫ్యాన్
ఇద్దరు అమ్మాయిలు విజయ్ దేవరకొండను కలవడానికి వచ్చారు. వారిద్దరిలో ఒక అమ్మాయి మాత్రం

హీరో విజయ్ దేవరకొండకు యూత్ లో భారీ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే.. ! అర్జున్ రెడ్డి సినిమా నుండి మన రౌడీ హీరోకు ఎంతో మంది అమ్మాయిలు ఫిదా అయిపోయారు. తాజాగా ఓ యువతి.. విజయ్ మీద తనకున్న ప్రేమను టాటూ రూపంలో చూపించింది. ఆ యువతి తన వీపుపై విజయ్ దేవరకొండ ఫొటోను టాటూగా వేయించుకుంది. ఆ యువతి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఇద్దరు అమ్మాయిలు విజయ్ దేవరకొండను కలవడానికి వచ్చారు. వారిద్దరిలో ఒక అమ్మాయి మాత్రం ఏకంగా వీపుపై విజయ్ దేవరకొండ ను టాటూలా వేయించుకుంది. ఆ అమ్మాయి విజయ్ దేవరకొండను డైరెక్ట్ గా కలవడంతో ఒక్కసారిగా షాక్ కు గురైంది. తన అభిమాన హీరో.. తనతో మాట్లాడుతూ ఉంటే ఆమెకు కనీసం మాటలు రాలేదు. విజయ్ ఆమెను హత్తుకుని.. కొద్దిసేపు మాట్లాడాడు. అక్కడే దర్శకుడు పూరీ జగన్నాథ్ కూడా ఉన్నారు. నటి, ప్రొడ్యూసర్ ఛార్మీ అక్కడే కనిపించారు.
పూరీ జగన్నాథ్‌ను లైగర్ సినిమా గురించి ఏమైనా అడగాలంటే అడగండి అని వారికి సూచించారు. డాక్టర్ చెర్రీ అనే అమ్మాయి వీపుపై విజయ్ టాటూను చూపించింది. అనంతరం వారితో సరదాగా ముచ్చటించి.. ఫొటోలకు ఫోజులు ఇచ్చాడు విజయ్. ఇందుకు సంబంధించిన వీడియోను విజయ్ దేవరకొండ టీమ్ ట్వీట్టర్లో షేర్ చేసింది.
Next Story

