Mon Dec 15 2025 08:14:46 GMT+0000 (Coordinated Universal Time)
దిగి వచ్చిన హీరో సిద్ధార్థ్
హీరో సిద్ధార్థ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ కు సోషల్ మీడియా వేదికగా క్షమాపణ చెప్పారు.

హీరో సిద్ధార్థ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ కు సోషల్ మీడియా వేదికగా క్షమాపణ చెప్పారు. తాను సైనా నెహ్మాల్ విషయంలో జోక్ మాత్రమే చేశానని సిద్ధార్థ్ వివరణ ఇచ్చుకున్నారు. మోదీ పంజాబ్ పర్యటనపై తొలుత సైనా నైహ్వాల్ స్పందించారు. దేశ ప్రధానికి భద్రత లేకపోతే ఇక ఎవరికి ఉంటుందని ఆమె ట్వీట్ చేశారు. అయితే సైనా నెహ్వాల్ ట్వీట్ ను సిద్ధార్థ్ రీట్వీట్ చేస్తూ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఒక చిన్న కాక్తో ఆడే ప్రపంచ ఛాంపియన్.. భారత్ ను కాపాడటానికి కొందరు రక్షకులు ఉన్నారంటూ కామెంట్ చేశారు.
క్షమాపణ చెబుతూ....
సిద్ధార్థ్ ట్వీట్ పై దుమారం చెలరేగింది. మహిళను కించపరుస్తూ మాట్లాడారంటూ సోషల్ మీడియాలో ఆయనపై నెటిజన్లు ఫైర్ అయ్యారు. జాతీయ మహిళ కమిషన్ సయితం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో సిద్ధార్థ్ దిగి వచ్చారు. తాను కేవలం జోక్ చేశానని, ఎవరిని కించపర్చే ఉద్దేశ్యం తనకు లేదని చెప్పారు. క్రీడాకారిణిగా సైనా నెహ్వాల్ ను గౌరవిస్తానని చెప్పారు. మహిళలంటే తనకు గౌరవమన్నారు. ఎవరైనా హర్ట్ అయి ఉంటే క్షమించమని కోరారు.
Next Story

