Thu Mar 19 2026 01:17:07 GMT+0530 (India Standard Time)
RRR కు ఆస్కార్ అవసరమా ? : హీరో నిఖిల్
తాజాగా ఈ విషయంపై హీరో నిఖిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. RRR సినిమాకు ఆస్కార్ అవసరమా ? అని ఆయన..

జూనియర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన RRR సినిమా ఘన విజయం సాధించింది. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ సినిమా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. కానీ RRRకు ఆస్కార్ నామినేషన్స్ లో చోటు దక్కకపోవడంతో అందరూ అసంతృప్తి చెందారు. ఈ విషయంపై పలువురు సినిమా ప్రముఖులు కూడా స్పందించారు. ఈ చిత్రం ఆస్కార్ కు నామినేట్ అవుతుందని భావించామని, చివరకు నిరాశ మిగిలిందని అన్నారు.
తాజాగా ఈ విషయంపై హీరో నిఖిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. RRR సినిమాకు ఆస్కార్ అవసరమా ? అని ఆయన ప్రశ్నించారు. తనకు ఆస్కార్ అవార్డులపై పెద్దగా ఆసక్తి, మంచి అభిప్రాయం లేదని చెప్పారు. సినిమాకు ప్రేక్షకుల నుంచి వచ్చే స్పందన ఆస్కార్ కంటే ఎక్కువని అన్నారు. మనకు ఫిల్మ్ ఫేర్, జాతీయ అవార్డులు ఉన్నాయని.. ఆస్కార్ అవార్డులు మనకెందుకని ప్రశ్నించారు. ఇటీవల స్పెయిన్ కు వెళ్లినపుడు RRR చూశానని.. అక్కడకూడా థియేటర్లు హౌస్ ఫుల్ అవుతోందన్నారు. సినిమాకు ఇంతకుమించిన స్పందన ఇంకేముంటుంది ? ఆస్కార్ మనకు అవసరమా? అని వ్యాఖ్యానించారు.
Next Story

