Sun Mar 08 2026 04:11:18 GMT+0530 (India Standard Time)
ముగిసిన నవదీప్ విచారణ.. బయటకు వచ్చి చెప్పింది ఇదే!!
మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ నార్కోటిక్ విచారణ ముగిసింది.

మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ నార్కోటిక్ విచారణ ముగిసింది. ఆరుగంటల పాటు నవదీప్ ను నార్కో అధికారులు విచారించారు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో నిందితులు దేవరకొండ సురేష్, రామచంద్రతో నవదీప్ కు ఉన్న పరిచయాలపై ఆరా తీశారు అధికారులు. నిందితులు సురేష్, రామచంద్ర అకౌంట్ లోకి నవదీప్ డబ్బులు బదిలీ చేసినట్టు గుర్తించారు. సినీ ఫైనాన్సర్ వెంకటరత్నారెడ్డితో ఉన్న పరిచయాలపై కూడా ఆరా తీశారు.
విచారణ తర్వాత బయటకు వచ్చిన నవదీప్ మాట్లాడుతూ.. డ్రగ్స్ కేసులో నాకు నోటీసులు ఇచ్చినందుకు హాజరయ్యానని తెలిపారు. డ్రగ్స్ కేసులో సిపి సివి ఆనంద్, ఎస్పీ సునీత రెడ్డి నేతృత్వంలో టీం బాగా పనిచేస్తుందని తెలిపారు. రామచంద్ర అనే వ్యక్తి నాకు పరిచయం అన్నమాట వాస్తవమే కానీ నేను ఎక్కడ డ్రగ్స్ తీసుకోలేదు, కొనుగోలు చేయలేదన్నారు నవదీప్. గతంలో ఒక పబ్ ను నిర్వహించినందుకు నన్ను పిలిచి విచారించారన్నారు. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానని.. అవసరం ఉంటే మళ్లీ పిలుస్తామని చెప్పారని నవదీప్ తెలిపారు. నవదీప్ ఫోన్ ను నార్కోటిక్ బ్యూరో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాల్ లీస్ట్ ముందుంచి విచారించారు పోలీసులు. వాట్సప్ చాటింగ్ ను అధికారులు రిట్రీవ్ చేయనున్నారు.
Next Story

