Mon Mar 23 2026 01:38:56 GMT+0530 (India Standard Time)
ఏపీలో మూవీ టిక్కెట్లపై నాగ్ స్పందన ఇదే
ఏపీ లో సినిమా టిక్కెట్ల పై హీరో నాగార్జున స్పందించారు. తనకు ప్రస్తుత టిక్కెట్ ధరలతో ఇబ్బందేమీ లేదని ఆయన తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ల పై హీరో నాగార్జున స్పందించారు. తనకు ప్రస్తుత టిక్కెట్ ధరలతో ఇబ్బందేమీ లేదని ఆయన తెలిపారు. టిక్కెట్ల రేట్లు ఎక్కువగా ఉంటే కొంచెం ఎక్కువగా డబ్బులు వస్తాయని, లేకుంటే కొంత తక్కువ వస్తాయని నాగార్జున అన్నారు. మిగిలిన వారి సంగతి ఏమో కాని తన సినిమాకు మాత్రం ఇబ్బంది లేదని నాగార్జున అన్నారు.
టిక్కెట్ ధరలపై...
బంగార్రాజు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగార్జునను మీడియా అడిగిన ప్రశ్నకు ఈ సమాధానం చెప్పారు. బంగార్రాజు సినిమాను ఈ సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయించారు. ఏపీలో టిక్కెట్ ల ధరలతో తాను సంతోషంగా ఉన్నానని నాగార్జులన తెలిపారు.
Next Story

