Fri Dec 05 2025 16:21:06 GMT+0000 (Coordinated Universal Time)
హీరో నాగశౌర్యకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
నాలుగు రోజులుగా ఆయన మంచినీరు తాగకుండా సినిమా ఫైట్ సీన్ షూటింగ్ చేస్తున్న క్రమంలో.. సెట్ లో కళ్లు తిరిగి..

సినీ హీరో నాగశౌర్య అస్వస్థతకు గురయ్యారు. నాలుగు రోజులుగా ఆయన మంచినీరు తాగకుండా సినిమా ఫైట్ సీన్ షూటింగ్ చేస్తున్న క్రమంలో.. సెట్ లో కళ్లు తిరిగి పడిపోయినట్లు తెలుస్తోంది. దీంతో శౌర్యను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, సాయంత్రం డిశ్చార్జ్ అవుతారని వైద్యులు తెలిపారు.
2014లో ఊహలు గుసగుసలాడే సినిమాతో వచ్చి.. అమ్మాయిల మదిని దోచుకున్న ఆరడుగుల అందగాడు, హ్యాండ్సమ్ హీరో నాగశౌర్య త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతున్నాడట. తెలుగు తెరపై హీరోగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి దాదాపు పుష్కరకాలం.. అంటే పన్నెండేళ్లు కావొస్తోంది. 12 ఏళ్లలో 24 సినిమాలు చేశాడు. 24వ సినిమా అనౌన్స్ మెంట్ ఇటీవలే వచ్చింది. త్వరలోనే మరో రెండు ప్రాజెక్టులు సెట్స్ పైకి రానున్నట్లు సమాచారం. ఈ నెల 19,20 తేదీల్లో నాగశౌర్య.. అనూష అనే అమ్మాయిని బెంగళూరులో వివాహం చేసుకోనున్నారు. పెళ్లి సమయం దగ్గరపడుతున్న సమయంలో నాగశౌర్య అస్వస్థతకు గురికావడం కుటుంబీకులను కలచివేసింది.
Next Story

