Wed Mar 18 2026 20:05:49 GMT+0530 (India Standard Time)
ఆ హీరోహీరోయిన్లకు డ్రీమ్ హౌజ్ సిద్ధమయిందా..?

బాలీవుడ్ స్టార్లు దీపికా పదుకొనే, రణవీర్ సింగ్ త్వరలో పెళ్లిపీటలెక్కనున్నారనే వార్తలు ముంబై ఫిలిం సర్కిళ్లలో జోరుగా వినిపిస్తున్నాయి. ఈ సంవత్సరం చివరన వారి పెళ్లి ఉంటుందని, ఇప్పటికే ఇందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయనేది ఆ వార్తల సారాంశం. ఈ మేరకు ఇటీవల ముంబైలోని బాంద్రాలో దీపిక తన తల్లితో కలిసి పెళ్లి కోసం సంప్రదాయ ఆభరణాలు కూడా కొనుగోలు చేసిందంట. అయితే, తాజాగా మరో వార్త హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరూ వివాహం తర్వాత ఉండేందుకు డ్రీమ్ హౌజ్ ను కూడా సెలెక్ట్ చేసుకున్నారంట. ముంబైలోని ఓ ప్రైమ్ ఏరియాలో రెండు అంతస్థుల భవనాన్ని వీరు కొనుగోలు చేశారని, ప్రస్థుతం ఆ భవనానికి అదనపు హంగులు అద్దుతున్నారని వినిపిస్తోంది. అంతే కాదు ఈ ఏర్పాట్లను దీపికనే స్వయంగా పర్యవేక్షిస్తుందంట.
Next Story

