Sat Dec 06 2025 12:23:20 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ మూవీ టిక్కెట్ల వివాదంపై బాలయ్య ఏమన్నారంటే?
సినిమా పరిశ్రమ పదికాలాల పాటు చల్లగా ఉండాలని ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు.

సినిమా పరిశ్రమ పదికాలాల పాటు చల్లగా ఉండాలని ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. సినిమాల్లో పెద్ద, చిన్న తేడా లేదన్నారు. చిన్న సినిమా హిట్ అయితే అది పెద్ద సినిమానేనని, పెద్ద సినిమా ప్లాప్ అయితే అది చిన్న సినిమానేనని బాలయ్య అన్నారు. సినీ పరిశ్రమ ద్వారా వేలాది మంది ఉపాధి పొందుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
కలసికట్టుగా....
సినీ పరిశ్రమకు ప్రభుత్వాల సహకారం కూడా అవసరమని బాలకృష్ణ అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో సినిమా గోడును పట్టించుకునే వారు లేరన్నారు. ఏపీలో సినిమా టిక్కెట్ల ధరల విషయంపై అందరూ కలసికట్టుగా ఉండాలన్నారు. దీనిపై పరిశ్రమ తీసుకునే నిర్ణయాన్ని తాను స్వాగతిస్తానని బాలకృష్ణ చెప్పారు.
Next Story

