Fri Dec 05 2025 18:39:33 GMT+0000 (Coordinated Universal Time)
RRR సినిమాపై బన్నీ ప్రశంసలు.. తారక్ షో చూస్తుంటే ముచ్చటేసింది !
మనమంతా గర్వపడే రాజమౌళి విజన్ గొప్పగా ఉంది. నా అన్న మెగా పవర్ రామ్ చరణ్ తన కెరీర్ లోనే గుర్తుండిపోయే పెర్ఫార్మెన్స్..

హైదరాబాద్ : RRR సినిమాపై అల్లు అర్జున్ స్పందించాడు. సినిమా చాలా అద్భుతంగా ఉందంటూ ట్వీట్ చేశారు. ఇన్నేళ్ల కృషికి తగిన ఫలితంగా.. గొప్ప విజయం సాధించిన సినిమా బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
"మనమంతా గర్వపడే రాజమౌళి విజన్ గొప్పగా ఉంది. నా అన్న మెగా పవర్ రామ్ చరణ్ తన కెరీర్ లోనే గుర్తుండిపోయే పెర్ఫార్మెన్స్ చేశాడు. అందుకు గర్వంగా ఉంది. పవర్ హౌస్ లాంటి నా బావ తారక్ షో చూస్తే చాలా ముచ్చటేసింది. అతడంటే నాకు ఎప్పుడూ గౌరవం, ఇష్టమే. అజయ్ దేవగణ్, ఆలియా చాలా బాగా చేశారు. కీరవాణి, సెంథిల్ కుమార్, డీవీవీ దానయ్య.. ఇంకా అందరికీ ప్రత్యేక శుభాభినందనలు. భారతీయ సినిమాను గర్వపడేలా చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. నిజంగా ఇది KilleRRR" అంటూ బన్నీ ట్వీట్లలో పేర్కొన్నారు.
రాజమౌళి కలల ప్రాజెక్ట్ RRR కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.257 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. మరో 10 పదిరోజుల పాటు RRR హవా కొనసాగుతుందని అంచనా.
Next Story

