Thu Mar 19 2026 17:40:28 GMT+0530 (India Standard Time)
పొలిటికల్ ఎంట్రీపై నాగార్జున కామెంట్స్
రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని హీరో అక్కినేని నాగార్జున తెలిపారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని చెప్పారు

రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని హీరో అక్కినేని నాగార్జున తెలిపారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని చెప్పారు. విజయవాడ ఎంపీగా తాను పోటీ చేయనని ఆయన చెప్పారు. ఎన్నికలు వచ్చే ముందు ప్రతిసారీ ఇలాగే తనపై ప్రచారం జరుగుతుందని ఆయన అన్నారు. గతకొన్నేళ్లుగా జరుగుతున్న ఇలాంటి ప్రచారాలను తాను పెద్దగా పట్టించుకోనని నాగార్జున కొట్టిపారేశారు. ఘోస్ట్ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆయన మీడియా అడిగిన ప్రశ్నలకు ఈ విధంగా స్పందించారు.
రాజకీయాల్లోకి....
తాను సినిమాల్లోనే హాయిగా ఉన్నానని ఆయన అన్నారు. తనకు రాజకీయాలంటే ఆసక్తి లేదని కూడా ఆయన చెప్పారు. నాగార్జున ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో సన్నిహితంగా ఉంటారు. అందుకే ఆయనపై గత కొంతకాలంగా ఈ ప్రచారం జరుగుతుంది. కానీ ఈ ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. తనకు రాజకీయాలంటే ఆసక్తి లేదని చెప్పారు. విజయవాడ పార్లమెంటు సభ్యుడిగానే కాదు ఎక్కడి నుంచి కూడా తాను పోటీ చేయబోనని చెప్పారు.
Next Story

