Mon Mar 30 2026 21:09:10 GMT+0530 (India Standard Time)
తీవ్ర అనారోగ్యానికి గురైన సూపర్ స్టార్ కృష్ణ

సూపర్ స్టార్ కృష్ణ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. శ్వాస సంబంధిత వ్యాధితో కృష్ణ బాధపడుతున్నారు. అయితే చికిత్స నిమిత్తం సూపర్ స్టార్ కృష్ణ కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరారు. హీరో కృష్ణ అరోగ్యం నిలకడగానే ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. శ్వాస సంబంధిత సమస్యతో హైదరాబాద్లోని గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.
కృష్ణ ఆరోగ్యం బాగానే ఉందని సీనియర్ నటుడు నరేష్ అన్నారు. శ్వాస సంబంధిత సమస్యతో ఆసుపత్రిలో చేర్చామన్నారు. 24 గంటల తర్వాత హస్పిటల్ నుండి ఆయనను డిశ్చార్జీ చేస్తామని వైద్యులు చెప్పినట్లు నరేష్ మీడియాకు చెప్పారు.
Next Story

