Mon Dec 15 2025 00:10:23 GMT+0000 (Coordinated Universal Time)
ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్.. పవన్ బ్యాక్ టు పాలిటిక్స్..!
ఇటీవల మొదలైన ఉస్తాద్ భగత్ సింగ్ సెకండ్ షెడ్యూల్ గురించి హరీష్ శంకర్ అప్డేట్ ఇచ్చాడు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. వాటిలో ఒకటి ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh). హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ అప్పుడెప్పుడో మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. మళ్ళీ చాలా గ్యాప్ తరువాత ఇటీవల రెండో షెడ్యూల్ తో పట్టాలు ఎక్కింది. హరీష్ శంకర్ ఈ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలు ప్లాన్ చేయడంతో హైదరాబాద్ లో భారీ సెట్స్ ని కూడా వేశారు.
ఇక ఈ షెడ్యూల్ ఇలా మొదలైందో లేదో.. అటు ఏపీలో పాలిటిక్స్ లో హీట్ మొదలైంది. దీంతో పవన్ మళ్ళీ అటు యూటర్న్ తీసుకున్నాడు. ఇక అభిమానులంతా.. ఉస్తాద్ షూటింగ్ ఇప్పటిలో అవ్వడం కష్టమే అనుకున్నారు. అయితే పవన్ మళ్ళీ తిరిగి వచ్చి షూటింగ్ ని ఫుల్ స్వింగ్ లో నడిపించాడు. తాజాగా ఈ మూవీ షూటింగ్ గురించి హరీష్ శంకర్ అప్డేట్ ఇచ్చాడు. మూవీలోని మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇంటెన్స్ పార్ట్ షూటింగ్ పూర్తి అయ్యినట్లు తెలియజేశాడు. పవన్ తన పవర్ ఫుల్ యాక్టింగ్ తో అదరగొట్టేసినట్లు చెప్పుకొచ్చాడు.
ఈ అప్డేట్ తో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక ఈ షెడ్యూల్ పూర్తి అవ్వడంతో పవన్ మళ్ళీ బ్యాక్ టు పాలిటిక్స్ రాబోతున్నాడని తెలుస్తుంది. జనసేన నాలుగో విడత వారాహి యాత్రని స్టార్ట్ చేయడానికి పవన్ సిద్దమవుతున్నాడు. ఆ యాత్ర పూర్తి అయిన తరువాత మళ్ళీ షూటింగ్స్ లో పాల్గొనున్నాడు. మరి తిరిగి వచ్చాక ఉస్తాద్ కి డేట్స్ ఇస్తాడా..? లేదా ఇతర సినిమాలకు ఇస్తాడా..? చూడాలి.
పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఇతర ప్రాజెక్ట్స్ OG, హరిహర వీరమల్లు. వీటిలో ఓజి మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ చివరి దశలో ఉంది. ఇక వీరమల్లు విషయానికి వస్తే.. 60 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ని కూడా మొదలుపెట్టి ఈ ఏడాది చివరిలోపు చిత్రీకరణ మొత్తం పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాని ఏపీ ఎన్నికల లక్ష్యంగా రిలీజ్ చేయాలని మేకర్స్ అండ్ పవన్ భావిస్తున్నాడని సమాచారం.
Next Story

