Wed Jan 21 2026 01:16:30 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : చిరంజీవి తమ్ముడైనా ప్రజలు ఆదరించకపోతే అంతే
హరిహరవీరమల్లు మూవీ ఈ నెల 24వ తేదీన విడుదలవుతుంది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మీడియా సమావేశంలో మాట్లడారు

హరిహరవీరమల్లు మూవీ ఈ నెల 24వ తేదీన విడుదలవుతుంది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మీడియా సమావేశంలో మాట్లడారు. ఎవరూ సొంత టాలెంట్ లేకుండా చిత్ర పరిశ్రమలో ఎదగలేరని ఆయన అన్నారు. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ నటన రాకపోతే చిరంజీవి తమ్ముడైనా, కొడుకునైనా ప్రజలు ఆదరించరన్న విషయం గుర్తుంచుకోవాలని పవన్ కల్యాణ్ అన్నారు. తాను ఉపముఖ్యమంత్రిగా బిజీగా ఉన్నప్పటికీ హరిహర వీరమల్లు సినిమాను ఉదయం, రాత్రి వేళ షూటింగ్ పూర్తి చేశానని పవన్ కల్యాణ్ తెలిపారు.
పాలిటిక్స్‌లోకి వెళ్లడంతో...
పాలిటిక్స్‌లోకి వెళ్లడం కూడా సినిమా విడుదలకు కొంత ఆలస్యమయిందని, షూటింగ్ లో అంతరాయం కలిగించిందని పవన్ కల్యాణ్ అన్నారు. ఈ సినిమాకు తన బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చానన్న పవన్ కల్యాన్ చాలా కాలం తర్వాత మార్షల్ ఆర్ట్ చేశానని చెప్పుకొచ్చారు. మండుటెండల్లో చాలా రోజులు సినిమా క్లైమాక్స్ చేశామన్నారు. క్లైమాక్స్ పార్ట్‌ను ప్రత్యేకంగా రూపొందించామని, సినిమా బతకాలి.. సినిమా కోసం యుద్ధాలు చేయాల్సి వచ్చిందని తెలిపారు. ఈ సినిమా తనకు నచ్చిందని ప్రజలకు ఎలా ఉంటుందో తాను ఎలా చెప్పగలనని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి సినీ హీరో పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.
Next Story

