ఆ ప్లేస్ లోకి మరొకరెవరొస్తారో?
గత శనివారం ఎప్పటిలాగే హౌస్ మేట్స్ కి నాగార్జున సీరియస్ క్లాస్ తో కొరడా ఝుళిపించాడు. అభిజిత్ కి అఖిల్ కలిపి మోనాల్ విషయంలో వార్నింగ్ ఇచ్చేసాడు. [more]
గత శనివారం ఎప్పటిలాగే హౌస్ మేట్స్ కి నాగార్జున సీరియస్ క్లాస్ తో కొరడా ఝుళిపించాడు. అభిజిత్ కి అఖిల్ కలిపి మోనాల్ విషయంలో వార్నింగ్ ఇచ్చేసాడు. [more]
గత శనివారం ఎప్పటిలాగే హౌస్ మేట్స్ కి నాగార్జున సీరియస్ క్లాస్ తో కొరడా ఝుళిపించాడు. అభిజిత్ కి అఖిల్ కలిపి మోనాల్ విషయంలో వార్నింగ్ ఇచ్చేసాడు. ఇక సోహైల్ కి పిచ్చి కుక్కలాగా మాట్లాడుతున్నావ్ అంటూ గడ్డి పెట్టాడు. అలాగే మెహబూబ్ కి పుచ్చ పగిలిపోతుంది అంటావా అంటూ తలంటాడు. అమ్మ రాజ శేఖర్ కి కూడా ఫుల్ క్లాస్ ఇచ్చేసిన నాగార్జున పెద్దావిడ గంగవ్వ అభ్యర్ధన మేరకు బిగ్ బాస్ తో మాట్లాడి ఆవిడని ఇంటికి పంపించే ఏర్పాట్లు చేయడమే కాదు…. నాగార్జున బిగ్ బాస్ యాజమాన్యంతో మాట్లాడి ఇల్లు కట్టిస్తా అంటూ గంగవ్వకి మాటిచ్చేసి బిగ్ బాస్ లో ఓ మంచి కి శ్రీకారం చుట్టేశాడు. అక్కడ శనివారం సోహైల్ ని ఎలిమినేషన్ నుండి సేవ్ చేసిన నాగ్… గంగవ్వ కూడా అఖిల్ ని సేవ్ చేసి ఇంటికి పోయింది.
ఇక కథ అక్కడితో అవ్వలేదు. సన్ డే ఫన్ డే లో ఏడుగురు లో సుజాత ఎలిమినేట్ అయ్యింది. ఈ సన్ డే ఫన్ అంతగా అనిపించలేదు బిగ్ బాస్ లో. ఇక ఇప్పుడు హౌస్ లో 13 మంది సభ్యులు. పది వారాల ఆట మిగిలి ఉంది. ఇప్పటివరకు వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ద్వారా ముగ్గురు బిగ్ బాస్ లోకి అడుగుపెట్టగా మాస్ అవినాష్ కామెడీ బాగా వర్కౌట్ అవుతుంది. ఇక స్వాతి దీక్షిత్ మాత్రం ఒక్క వారంలోనే ఎలిమినేట్ అయ్యింది. కుమార్ సాయి ఏదో అలా అలా నడిపిస్తున్నాడు. ఇక ఇప్పుడు గంగవ్వ ప్లేస్ లోకి బిగ్ బాస్ లోకి దింపే కంటెస్టెంట్ పై అందరిలో చర్చ మొదలయ్యింది. గంగవ్వ ప్లేస్ లోకి వచ్చే కంటెస్టెంట్ అప్పుడే బిగ్ బాస్ క్వారంటైన్ లో ఉన్నారని… త్వరలోనే వాళ్ళు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వొచ్చని అంటున్నారు. మరి స్వాతి నే మల్లి తీసుకొస్తారో.. లేదంటే కొత్త కంటెస్టెంట్ ని ఎవరినైనా దింపుతుందో బిగ్ బాస్ అనేది చూడాలి.