Fri Dec 05 2025 15:42:12 GMT+0000 (Coordinated Universal Time)
Game Changer : ‘గేమ్ ఛేంజర్’లో రామ్ చరణ్ పాత్ర అన్ని రకాలుగా ఉంటుంది..
‘గేమ్ ఛేంజర్’లో రామ్ చరణ్ పాత్ర ఎన్నో రకాలుగా ఉంటుంది అంటున్న రచయిత బుర్ర సాయి మాధవ్.

Game Changer : తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేస్తున్న పొలిటికల్ యాక్షన్ డ్రామా మూవీ 'గేమ్ ఛేంజర్'. గతంలో సోషల్ ప్రాబ్లెమ్స్ ని కమర్షియల్ ఫార్మేట్స్ లో చూపించి బ్లాక్ బస్టర్స్ అందుకున్న శంకర్.. ఇప్పుడు మళ్ళీ అదే సక్సెస్ ఫార్ములాతో గేమ్ ఛేంజర్ ని తెరకెక్కిస్తుండడంతో మూవీ పై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇక ఈ మూవీ మొదలు పెట్టిన దగ్గర నుంచి రామ్ చరణ్ డిఫరెంట్ డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నాడు.
ఒకసారి స్టూడెంట్ పాత్రలో స్టైలిష్ గా, మరోసారి వింటేజ్ పాత్రలో, గవర్నమెంట్ ఆఫీసర్ గా.. ఇలా రకరకాల పాత్రల్లో కనిపిస్తున్నాడు. దీంతో మూవీలో రామ్ చరణ్ పాత్ర ఎలా ఉండబోతుందో అన్ని అందరిలో ఆసక్తి నెలకుంది. ఇక ఈ విషయానే ఈ సినిమాకి మాటలు అందిస్తున్న బుర్ర సాయి మాధవ్ ని అడగగా, ఆయన బదులిస్తూ.. "ఒక మనిషి లైఫ్ లో ఎన్ని వేరియేషన్స్ ఉంటాయో అన్ని రకాలుగా రామ్ చరణ్ ఈ సినిమాలో కనిపించబోతున్నారు. క్లాస్, మాస్, రగ్డ్, స్టైలిష్ గా.. ఇలా అనేక రకాలుగా కనిపిస్తారు" అంటూ చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియో చూసిన చరణ్ అభిమానుల్లో మూవీ పై మరింత అంచనాలు పెరిగిపోయాయి. ఆర్ఆర్ఆర్ లోనే రామ్ చరణ్ డిఫరెంట్ వేరియేషన్స్ ని చూపించి మెప్పించారు. ఇప్పుడు ఈ గేమ్ ఛేంజర్ తో మరో స్థాయికి వెళ్లే పర్ఫార్మెన్స్ ఉండబోతుందని అంచనా వేసేసుకుంటున్నారు. కాగా 2021లో మొదలైన ఈ చిత్రం మూడేళ్ళుగా షూటింగ్ జరుపుకుంటూనే వస్తుంది. ఈ ఏడాది జూన్ తో షూటింగ్ అయ్యిపోతుందని టాక్ వినిపిస్తుంది. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు.
Next Story

