Thu Jan 29 2026 15:07:49 GMT+0000 (Coordinated Universal Time)
Ram Charan : రామ్చరణ్ కూతురి కేర్ టేకర్ జీతం తెలిస్తే షాక్ అవుతారు..
రామ్చరణ్ కూతురు 'క్లీంకార'ని చూసుకునేందుకు ఓ ఆయాని నియమించి, ఆమెకు లక్షన్నరకు పైగా జీతం ఇస్తున్నారు.

Ram Charan : మెగా జంట రామ్ చరణ్, ఉపాసనలు దాదాపు పెళ్ళైన 11 ఏళ్ళకు తమ లైఫ్ లోకి ఒక చిన్న పాపకి ఆహ్వానం పలికారు. మెగా కౌపౌండ్ లోకి అడుగుపెట్టిన ఆ గారాలపట్టికి 'క్లీంకార' అంటూ హిందూ సంప్రదాయపద్ధతిలో ఓ కొత్త పేరుని పెట్టారు. ఇక ఈ వారసురాలు రాక కోసం మెగా కుటుంబమంతా ఎంతో ఆశగా ఏళ్లతరబడి ఎదురు చూస్తున్నారు. మరి అలాంటి వారసురాలిని ఎంత అపురూపంగా చేసుకుంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఈక్రమంలోనే 'క్లీంకార'ని చూసుకునేందుకు ఓ ఆయాని నియమించి, ఆమెకు లక్షన్నరకు పైగా జీతం ఇస్తున్నారు. అవును మీరు వింటుంది నిజమే. క్లీంకారని చూసుకునే కేర్ టేకర్ కి అక్షరాలా.. రూ.1,75,000 జీతం ఇస్తున్నారట. ఈ కేర్ టేకర్ గతంలో.. సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ లకు పుట్టిన పెద్ద కొడుకు అలనాపాలన చూసుకుంది. ఈమె బేబీ సిట్టింగ్ మాత్రమే కాదు, పిల్లలకు అవసరమయ్యే చికిత్స కూడా చేసే ప్రతిభ ఉందట. అందుకనే ఆమెకు అంత జీతం ఇస్తున్నారట. ఈ ఆయా పేరు సావిత్రి అని చెబుతున్నారు.
అయితే సావిత్రికి రామ్ చరణ్ దంపతులు నిజంగానే ఇంతటి జీతాన్ని ఇస్తున్నారా..? లేదా ఇది సోషల్ మీడియా రూమర్ మాత్రమేనా..? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వార్త అయితే నెట్టింట తెగ వైరల్ అవుతుంది. కాగా రామ్ చరణ్ ఇప్పటివరకు తన వారసురాలి ఫేస్ ని అభిమానులకు చూపించలేదు. క్లీంకార దర్శనం కోసం అభిమానులంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి మెగా జంట.. తమ వారసురాలిని ఎప్పుడు పరిచయం చేస్తారో చూడాలి.
Next Story

