Sun Feb 01 2026 18:54:05 GMT+0000 (Coordinated Universal Time)
ఈ వారం ఎలిమినేషన్ తనేనట
బిగ్ బాస్ నాన్ స్టాప్ ప్రారంభమై నాలుగు వారాలు గడుస్తుంది. నాలుగో వారం ఎలిమినేషన్ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది

బిగ్ బాస్ రియాల్టీ షో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 24 గంటలూ లైవ్ ప్రసారం జరుగుతుంది. తొలిసారి తెలుగులో 24 గంటలు లైవ్ షో నడుపుతున్న బిగ్ బాస్ లో ఈరోజు ఎలిమినేషన్ ఎవరు అవుతారన్నది ఆసక్తికరంగా మారింది. బిగ్ బాస్ నాన్ స్టాప్ ప్రారంభమై నాలుగు వారాలు గడుస్తుంది. నాలుగో వారం ఎలిమినేట్ అయ్యేది సరయు అని సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఉన్న వారిలో సరయు వీక్ కంటెస్టెంట్ అని చెబుతున్నారు.
వైల్డ్ కార్డ్ ఎంట్రీతో....
అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండే అవకాశాలు కన్పిస్తున్నాయి. మరోవైపు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తొలి వారం ఎలిమినేట్ అయిన ముమైత్ ఖాన్ తిరిగి హౌస్ లోకి వస్తారన్న ప్రచారం కూడా జరుగుతుంది. డబుల్ ఎలిమినేషన్ అయితే సరయు తో పాటు ఇంకొకరు ఎవరన్నది ఉత్కంఠగా మారింది.
Next Story

