Sun Jul 20 2025 06:24:08 GMT+0000 (Coordinated Universal Time)
Nithin : నితిన్ కు హిట్ పడటం లేదు.. అదే కారణమా?
హీరో నితిన్ కు ఎందుకో లక్ కలసి రావడం లేదు. ఎన్ని సినిమాలు చేసినా ఒక్క హిట్ కూడా పడటం లేదు

హీరో నితిన్ కు ఎందుకో లక్ కలసి రావడం లేదు. ఎన్ని సినిమాలు చేసినా ఒక్క హిట్ కూడా పడటం లేదు. ఎక్కడ లోపం? అన్నది తెలియడం లేదు. కథల ఎంపికలో నితిన్ పొరపాట్లు చేస్తున్నారా? లేక దర్శకుడి ఎంపికలోనూ దృష్టి పెట్టడం లేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వరసగా ఎన్నిసినిమాలు చేసినా అన్ని బాక్సా ఫీసు ముందు ఫట్ అంటున్నాయి. భీష్మ తర్వాత నితిన్ కు సరైన హిట్ దొరకడం లేదు. మంచి నటులను ఎంపిక చేసినా కథను ఎంచుకోకపోవడం, సరైన దర్శకుడి చేతిలో పడకపోవడం వల్లనే నితిన్ వరస ఫ్లాప్ లు వస్తున్నాయన్న టాక్ వినపడుతుంది.
మంచి హీరో అయినా...
నితిన్ నిజానికి మంచి హీరో. ఆయన సినీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చినప్పటికీ దానిని నమ్ముకోకుండా స్వశక్తినే నమ్ముకున్నాడు. సంఖ్య కోసం సినిమాలు చేస్తున్నట్లు అనిపిస్తుంది. కొంత గ్యాప్ ఇచ్చి అయినా సరైన దర్శకుడిని ఎంపిక చేసుకోవడంతో పాటు కథలో కూడా వెరైటీ ఉంటేనే నితిన్ కు హిట్ దక్కుతుందని నితిన్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. కామెడీ తో తీసిన సినిమాలు కూడా పండటం లేదు. రాబిన్ హుడ్ ఆశించినంత హిట్ కాకపోవడంతో నితిన్ లో నిరాశ తప్ప మరేమీ మిగిలేటట్లు లేదు.
కథను ఎంపిక చేసుకోవడంలో...
తాజాగా విడుదలయిన తమ్ముడు సినిమా టాక్ కూడా అనుకున్నంత స్థాయిలో లేదు. రొటీన్ కథలను ఎంపిక చేసుకోవడంతో పాటు ప్రేక్షకులను కట్టిపడేసే సీన్లు లేకపోవడంతోనే నితిన్ కు ఇలా బ్యాడ్ టైమ్ నడుస్తుందని అంటున్నారు. సరైన హిట్ కోసం కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్నా ఫలితం కనిపించడం లేదు. తమ్ముడుపై నితిన్ ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ అంచనాలకు అందని విధంగా ఈ మూవీ డిజాస్టర్ అయిందన్న టాక్ వినపడుతుంది. వేణుశ్రీరామ్ దర్శకత్వంలో సప్తమి గౌడ, లయ, వర్ష బొల్లమ్మ, సౌరభ్ సచ్ దేవ్, శ్వాసిక, హరిజేతలున్నారు. అయినా ప్రేక్షకులను అలరించడంలో తమ్ముడు వెనకబడి పోయాడంటున్నారు.
Next Story