Fri Dec 05 2025 15:40:47 GMT+0000 (Coordinated Universal Time)
పవన్-తేజ్ బ్రో నుండి ఫస్ట్ సాంగ్ వచ్చేస్తోంది
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో కలిసి నటిస్తున్న చిత్రం బ్రో. సముద్రఖని దర్శకత్వంలో

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో కలిసి నటిస్తున్న చిత్రం బ్రో. సముద్రఖని దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న బ్రో సినిమా నుండి పాట ఎట్టకేలకు రాబోతోంది. జులై 8న బ్రో నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల కానుంది. 'మై డియర్ మార్కండేయ' అంటూ సాగే ఈ సాంగ్ శనివారం సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు. ఇందులో కేతికా శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ కథానాయికలుగా నటించారు. బ్రో చిత్రం జులై 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.
తమిళంలో సూపర్ హిట్ అయిన వినోదయ సితం సినిమాకు ఇది రీమేక్‌గా తెరకెక్కుతోంది. సముద్రఖని దర్శత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్‌ప్లే చూసుకున్నారు. ఈ సినిమాలో పవన్ మరోసారి దేవుడిగా కనిపించబోతున్నాడు. ఇప్పటికే బ్రో సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాలలో బ్రో కూడా ఒకటి. ఉస్తాద్ భగత్ సింగ్, OG, హరి హర వీర మల్లు వంటి ప్రాజెక్ట్‌లను పూర్తీ చేయాల్సి ఉంది. వచ్చే ఎన్నికల్లోపు ఈ సినిమాలు విడుదల కానున్నాయి.
Next Story

