తల్లిగా అయినా ఓకె.. కానీ..!!
పవన్ కళ్యాణ్ భార్య కాక ముందు రేణు దేశాయ్ హీరోయిన్. అయితే రెండు సినిమాలకే పవన్ భార్య అయిన రేణు దేశాయ్ తర్వాత మళ్ళీ సినిమాల్లో నటించలేదు. [more]
పవన్ కళ్యాణ్ భార్య కాక ముందు రేణు దేశాయ్ హీరోయిన్. అయితే రెండు సినిమాలకే పవన్ భార్య అయిన రేణు దేశాయ్ తర్వాత మళ్ళీ సినిమాల్లో నటించలేదు. [more]
పవన్ కళ్యాణ్ భార్య కాక ముందు రేణు దేశాయ్ హీరోయిన్. అయితే రెండు సినిమాలకే పవన్ భార్య అయిన రేణు దేశాయ్ తర్వాత మళ్ళీ సినిమాల్లో నటించలేదు. కానీ పవన్ కళ్యాణ్ తో విడిపోయాక రేణు దేశాయ్ కి సినిమాల మీద మోజు పుట్టింది. ఓ సినిమాకి దర్శకురాలిగా, నిర్మాతగా మారిన రేణు దేశాయ్ కి మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలనే ఉంది. అందుకే అక్క పాత్రలకు ఓకె అనింది. తాజాగా ఆమెకి అవకాశాలు రాకపోవడంతో తల్లి పాత్రలకైనా రెడీ అంటుందట.
తనది తల్లి పాత్రలు చేసే వయసు కాకపోయినా.. తల్లి పాత్రలు చేస్తా అని.. యంగ్ హీరోలకు తల్లి పాత్రలను కాస్త స్టయిలిష్ గా రాయమని దర్శకనిర్మాతలకు హింట్ లు ఇస్తుందట. మిర్చిలో ప్రభాస్ తల్లిగా చేసిన నదియా, అత్తారింటికి దారేదిలో పవన్ అత్తగా చేసిన నదియా లాంటి పాత్రలు అయితే బెటర్ అని.. మరీ ముసలమ్మ పాత్రలు కాకుండా కాస్త స్టైలిష్ లుక్ లో ఉండే అమ్మ పాత్రలను సృష్టించమని అంటుందట.
- Tags
- Renu Desai