Sun Mar 15 2026 13:27:12 GMT+0530 (India Standard Time)
సిరివెన్నెల అంతిమ యాత్ర ప్రారంభం
సిరివెన్నెల సీతారామ శాస్త్రి అంతిమ యాత్ర ప్రారంభమయింది. మరికాసేపట్లో మహాప్రస్థానానికి చేరుకుంటుంది

సిరివెన్నెల సీతారామ శాస్త్రి అంతిమ యాత్ర ప్రారంభమయింది. మరికాసేపట్లో మహాప్రస్థానానికి చేరుకుంటుంది. ఫిల్మ్ నగర్ లో ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. మహేష్ బాబు, పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, నాగార్జున వంటి ప్రముఖులు వచ్చి సిరివెన్నెలకు నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. సిరివెన్నెల కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఇక పాటలను ఊహించుకోలేం....
సిరివెన్నెల భౌతిక కాయాన్ని చూసిన మహేష్ బాబు ఎమోషనల్ గా ఫీలయ్యారు. శాస్త్రిగారు పాటలు లేకుండా తెలుగు పాటలను ఊహించుకోవడం కష్టంగా ఉందని మహేష్ బాబు పేర్కొన్నారు. ఆయన తెలుగు చిత్ర పరిశ్రమకు తన పాటల ద్వారా మరిన్ని వెలుగులు అద్దారన్నారు. జూనియర్ ఎన్టీఆర్ సయితం సిరివెన్నెల లేని చిత్ర పరిశ్రమను ఊహించుకోలేమని భావోద్వేగానికి గురయ్యారు.
Next Story

