Sat Jul 12 2025 22:22:34 GMT+0000 (Coordinated Universal Time)
Raja Saab : టీజర్ తోనే ఫీలింగ్ మొత్తం చెప్పేశాడుగా? మారుతి మాయ ఇదేనేమో?
మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ టీజర్ ను కొద్దిసేపటి క్రితం చిత్ర యూనిట్ విడుదల చేసింది

మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ టీజర్ ను కొద్దిసేపటి క్రితం చిత్ర యూనిట్ విడుదల చేసింది. ప్రసాద్ ఐ మ్యాక్స్ లో ఈ టీజర్ ను విడుదల చేశారు. మారుతి మూవీ అంటే ఏదో ప్రత్యేకత ఉంటుంది. మారుతి ఇప్పటి వరకూ తీసిన మూవీలన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి రిజల్ట్ సాధించడంతో పాటు ఈ మూవీలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తుండటంతో మరింత బజ్ పెరిగింది. మారుతి - ప్రభాస్ కాంబినేషన్ మూవీ ఖచ్చితంగా హిట్ కొడుతుందన్న నమ్మకం కేవలం ఫ్యాన్స్ లో మాత్రమే కాదు.. డిస్ట్రిబ్యూటర్లలోనూ ఉంది.
కామెడీ, హర్రర్ తో...
మారుతి ఇప్పటివరకూ తీసిన అనేక చిత్రాల్లో భలే భలే మొగాడివోయ్, మహానుభావుడు వంటి సినిమాలు తీసి ప్రత్యేకతను చూపారు. ఇక ప్రభాస్ ను ఒకవైపు మాత్రమే చూపకుండా హర్రర్, యాక్షన్, థ్రిల్లర్ మూవీగా తెరకెక్కనుండటంతో ఇక ఇది ఏ స్థాయిలో రికార్డులను బద్దలు చేస్తుందన్నది ఫ్యాన్స్ అంచనాలకు కూడా అందడం లేదు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలయిన పోస్టర్లు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. నేడు రిలీజ్ చేసిన టీజర్ లో హీరోయిన్లు మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ తో పాటు చాలా మంది స్కై వైపు చూస్తు సంభ్రమాశ్చర్యానికి గురవుతున్నారు.
తొలిసారి డబుల్ యాక్షన్ లో...
అందులో ప్రభాస్ తొలిసారి డబుల్ యాక్షన్ లో నటిస్తుండటంతో పెద్దయెత్తున ఐమాక్స్ వద్దకు డార్లింగ్ ఫ్యాన్స్ తరలి వచ్చారు. అత్యధిక సంఖ్యలో వచ్చిన అభిమానులను కట్టడి చేయడం కష్టంగా మారింది. బాణాసంచాలు పేల్చి తమ అభిమానాన్ని ప్రభాస్ పై చాటుకున్నారు. మూవీకి సంబంధించిన టీజర్ తోనే ఈ సినిమాలో అన్ని హంగులున్నాయని మారుతి చెప్పేశారు. ప్రభాస్ ఈ మూవీలో తాత, మనవడి రోల్ ప్లే చేస్తుండటం ఆసక్తిగా మారింది. కామెడీతో కూడా మారుతి పండించగలడన్న నమ్మకంతో ఇక ప్రభాస్ ఫ్యాస్స్ కు మంచి ఫీస్టు అందినట్లే.
Next Story