Fri Dec 05 2025 19:13:19 GMT+0000 (Coordinated Universal Time)
మోహన్ బాబు బహిరంగ లేఖ.. వారిపైనే...?
సినీ నటుడు మోహన్ బాబు బహిరంగ లేఖ రాశారు. సినిమా ఇండ్రస్ట్రీ అంటే నలుగురు హీరోలు, నలుగురు ప్రొడ్యూసర్లు కాదని చెప్పారు

సినీ నటుడు మోహన్ బాబు బహిరంగ లేఖ రాశారు. సినిమా ఇండ్రస్ట్రీ అంటే నలుగురు హీరోలు, నలుగురు ప్రొడ్యూసర్లు కాదని చెప్పారు. సినిమా ఇండ్రస్ట్రీలో ఏ ఒక్కరి గుత్తాధిపత్యం తగదని మోహన్ బాబు సూచించారు. చిన్న నిర్మాతలను కలుపుకుని వెళ్లి ముఖ్యమంత్రులను కలవాలని ఈ లేఖలో కోరారు.
అందరినీ కలుపుకుని....
మంత్రులను, ముఖ్యమంత్రులను కలిసే ముందు అందరూ సమావేశమవ్వాలని మోహన్ బాబు కోరారు. సినీరంగంలో ఎవరు ఎక్కువా? ఎవరు తక్కువా కాదని తన లేఖలో పేర్కొన్నారు. అందరం కలసి కూర్చుని చర్చంచుకుంటే పరిశ్రమలో సమస్యలను పరిష్కరించుకోవచ్చని మోహన్ బాబు తెలిపారు. పరోక్షంగా మోహన్ బాబు మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసినట్లే కన్పిస్తుంది.
Next Story

