Wed Mar 11 2026 08:36:01 GMT+0530 (India Standard Time)
సమంతకు అస్వస్థత.. కడప నుంచి రాగానే?
సినీ నటి సమంత అస్వస్థతకు గురయ్యారు. ఆమె తీవ్ర తలనొప్పి, వైరల్ ఫీవర్, జలుబుతో బాధపడుతున్నారు.

సినీ నటి సమంత అస్వస్థతకు గురయ్యారు. ఆమె తీవ్ర తలనొప్పి, వైరల్ ఫీవర్, జలుబుతో బాధపడుతున్నారు. దీంతో సమంత ఏఐజీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుని ఇంటికి వెళ్లారు. సమంత పరీక్షలకు సంబంధించి రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. అయితే వైద్యులు మాత్రం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
పరీక్షలు చేయించుకుని.....
సమంత నిన్న కడప జిల్లాలో పర్యటించారు. అక్కడ ఒక షోరూం ప్రారంభోత్సవానికి వెళ్లారు. సమంతను చూసేందుకు వేల సంఖ్యలో జనం గుమికూడారు. కడప నుంచి వచ్చిన అనంతరం సమంత అస్వస్థతకు గురయ్యారు. అయితే సమంత ఆరోగ్యంగానే ఉన్నారని సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మవద్దని ఆమె మేనేజర్ కోరారు.
Next Story

