Fri Dec 05 2025 12:46:56 GMT+0000 (Coordinated Universal Time)
చివరిగా రాత్రి బాబూ మోహన్ తోమాట్లాడిన కోట
విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావుతో రాత్రి కూడా మాట్లాడనని సినీనటుడు బాబూ మోహన్ తెలిపారు

విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావుతో రాత్రి కూడా మాట్లాడనని సినీనటుడు బాబూ మోహన్ తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తాను ఎప్పటికప్పుడు ప్రతి రోజూ తెలుసుకుంటున్నానని, అందులో భాగంగా ప్రతి రోజూ కోట శ్రీనివాసరావుతో మాట్లాడుతున్నానని, తెలిపారు. నిన్న కోట శ్రీనివాసరావుతో మాట్లాడినప్పుడు బాగానే మాట్లాడానని, ఆరోగ్యం ఎలా ఉందని ప్రశ్నిస్తే బాగానే ఉందని సమాధానమిచ్చాడని, ఒకసారి వీలుంటే వచ్చి వెళ్లమని కూడా తనతో అన్నట్లు బాబూ మోహన్ తెలిపారు.
వెళదామనుకున్న సమయంలో...
తాను వెళదామనుకున్న సమయంలో ఈ వార్త తెలిసిందని, కోట శ్రీనవాసరావు మరణవార్త తనను కలచి వేసిందని బాబూ మోహన్ బోరుమని ఏడ్చారు. ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తమిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అనేక సినిమాలు హిట్ అయ్యాయని గుర్తుకు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.
Next Story

